bigg boss 4 telugu_ anchor lasya reveals bad experiences in her life

Anchor Lasya: Telugu Bigg Boss 4: బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న యాంకర్ లాస్య తన లైఫ్‌లో జరిగిన దారుణమైన విషయాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకుంది. గురువారం నాడు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ ప్రకారం.. సమాజం కోసం కానీ.. వేరే వాళ్ల జీవితంలో వెలుగులు నింపిన సంఘటనల్ని కానీ.. ఇంటి సభ్యులందరితోనూ పంచుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో.. జీవితంలో వెలుగులు నింపిన విషయాన్ని కాకుండా పసి గుడ్డు జీవితాన్ని ఆర్పేసిన విషయాన్ని షేర్ చేసుకుంది లాస్య.

‘నాకు 2010 పెళ్లైంది.. అది మీలో చాలామందికి తెలియదు.. బిగ్ బాస్ షోకి వచ్చిన తరువాతే ఆ విషయాన్ని బయటపెట్టా. 2010లో పెళ్లి చేసుకున్నా వేరు వేరుగానే ఎవరిలైఫ్‌లో వాళ్లు ఉన్నాం.. 2012 నుంచి కలిసి ఉన్నాం. ఆ రెండేళ్లలో మా ఫ్యామిలీస్‌ని ఒప్పించడానికి ట్రై చేశాం. వాళ్లు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. అందుకే 2012 నుంచి కలిసి ఉండాలని డిసైడ్ అయ్యాం.

ఆ తరువాత 2014 జనవరిలో మా నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ‘నువ్ పెళ్లి చేసుకున్నావని మన ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు’ అని అన్నారు.. నేను కూడా ఎవరికీ చెప్పలేదు అని చెప్పా.. ఎవరికీ చెప్పకు.. ముందు సెటిల్ అవ్వండి.. మీ కాళ్ల మీద మీరు నిలబడండి అప్పుడు నేనే పెళ్లి చేస్తా అని చెప్పారు.

ఆ తరువాత వారంలో నాకు హెల్త్ బాలేదు.. హాస్పటల్‌కి వెళ్తే ప్రెగ్నెంట్ అని చెప్పారు. 2014లోనే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. పేరెంట్స్‌కి చెప్పలేం.. రెండు రోజులు ఆలోచించుకున్నాం.. చెప్పేవారు కూడా ఎవరూ లేరు. దీంతో కడుపు తీయించేసుకున్నా. కానీ 2014లో హాస్పటల్‌కి వెళ్లి చెక్ చేయించుకున్న తరువాత ప్రెగ్నెంట్ అని చెప్పారో.. ఆ ఫైల్ చూసుకున్నప్పుడల్లా చాలా బాధ వేస్తుంది. ఇప్పటికీ ఆఫైల్ నా దగ్గర ఉంది. నా ఫస్ట్ బేబీని నేను చాలా మిస్ అవుతాను. నా చేతులతో నా బేబీని చంపేసుకున్నా.. ఆ తరువాత ప్రెగ్నెంట్ కానేమో అని చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.

అప్పుడు ఫస్ట్ బేబీని తీసేసుకున్న విషయం మీకు తెలియదు ఇప్పుడు చెప్తున్నా కాబట్టి.. తప్పు చేసి ఉంటే క్షమించండి’ అంటూ చేసిన తప్పుకు కన్నీరు మున్నీరుగా విలపించింది లాస్య.