బిగ్ బాస్ 4 – 1 మిలియన్ ట్వీట్స్ తో సెన్సేషనల్ రికార్డు సృష్టించి అభిజీత్ ఫ్యాన్స్

0
626
బిగ్ బాస్ 4 – 1 మిలియన్ ట్వీట్స్ తో సెన్సేషనల్ రికార్డు సృష్టించి అభిజీత్ ఫ్యాన్స్
బిగ్ బాస్ 4 – 1 మిలియన్ ట్వీట్స్ తో సెన్సేషనల్ రికార్డు సృష్టించి అభిజీత్ ఫ్యాన్స్

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత తెచ్చుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మన తెలుగులో కూడా అంతే సక్సెస్ రేట్ ను అందుకుంది. ఇక అలాగే ప్రతీ సీజన్లో కూడా ఒక కంటెస్టెంట్ బాగా హైలైట్ అయ్యినట్టుగా ఈసారి సీజన్లో కూడా ఓ కంటెస్టెంట్ కు మైండ్ బ్లోయింగ్ ఆదరణ దక్కింది, అతడే అభిజీత్.

షో మొదటి నుంచి కూడా తన గ్రాఫ్ ను పెంచుకున్నాడే తప్ప అభిజీత్ కు తగ్గినట్టు ఎక్కడా అనిపించలేదు అనే కన్నా తన ఫాలోవర్స్ తగ్గనివ్వలేదని చెప్పొచ్చు. పలు టాస్కుల పరంగా కాస్త ఈ కంటెస్టెంట్ వీక్ అయినా తనదైన క్లారిటీ అద్భుతమైన ఫాలోయింగ్ కు తెచ్చుకున్నాడు. మరి వారే ఇప్పుడు ట్విట్టర్ ప్రపంచంలో ఇది వరకు ఏ సీజన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కూడా లేని విధమైన రికార్డులను అందించారు.

ఇపుడు అయితే యూనానిమస్ అని చెప్పాలి. “కింగ్ ఆఫ్ హార్ట్స్ అభిజీత్” అనే ట్యాగ్ తో 24 గంటలు తిరక్క ముందే 1 మిలియన్ ట్వీట్స్ తో సెన్సేషనల్ రికార్డు సృష్టించి బిగ్ బాస్ హిస్టరీలోనే సరికొత్త సెన్సేషన్ ను నమోదు చేశారు. మరి ఇది ఫైనల్స్ లో అభిజీత్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Previous articleRana Daggubati First Look Poster From Virataparvam
Next articleRana Daggubati’s First Glimpse From ViraataParvam