Bigg Boss 4 Telugu Wild Card Entry Contestants: బిగ్‌బాస్‌లో మజాను రెట్టింపు చేసేది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. షో నడుస్తున్న సమయంలో వైల్డ్ కార్డ్ అంటూ కొత్తవారిని తీసుకొస్తుంటాడు పెద్దాయన. అలా ఈసారి కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క గంగవ్వ తప్పితే.. వినోదాన్ని పంచే కంటెస్టెంట్స్ కరువయ్యారు నాలుగో సీజన్లో. హాట్ పెర్ఫామెన్స్లతో హీటెక్కించే అందగత్తెలైతే ఈ సీజన్లో ఉన్నారు కాని.. బిగ్ బాస్ హౌస్‌లో వాళ్ల పెర్ఫామెన్స్ పూర్ అని మూడు ఎపిసోడ్లకే జనం ఫిక్స్ అయ్యేలా చేశారు.
అయితే ఈ వారం నామినేషన్ ప్రక్రియ షురూ కావడంతో గంగవ్వతో పాటు అభిజిత్, అఖిల్, మెహబూబ్, సుజాత, దివి, సూర్యకిరణ్‌లు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఒకరు లేదా ఇద్దరు వచ్చే శని ఆదివారాల్లో బ్యాగ్ సర్దేయనున్నారు. అయితే ఈ సారి ఎవరెవరు వైల్డ్‌కార్డు రూపంలో వస్తారనేదే ఇక్కడ ప్రశ్న.
వైల్డ్ కార్డు ఎంట్రీ గురించి మాట్లాడితే ముఖ్యంగా నాలుగు పేర్లు వినినిపిస్తున్నాయి. అయితే అందులో ముగ్గురు మాత్రమే ఇంట్లోకి వస్తారని తెలుస్తోంది. ఇంకొరు ఇంట్లో ఉన్నవాళ్లే అని అనుకుంటున్నారు. జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాష్ పేరు బిగ్ బాస్ లిస్ట్‌లో తొలి నుంచి ఉంది. అయితే అనూహ్యంగా అవినాష్ తొలి 16 మంది కంటెస్టెంట్స్‌లో మిస్ అయ్యాడు. అలాగే ‘ఈరోజుల్లో’ ఫేమ్ సాయి కుమార్ పంపన పేరు కూడా వినిపించింది.
ఎలాగూ వచ్చే వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరిద్దరు బ్యాగ్ సర్దేయడం ఖాయమైంది. దీంతో ముక్కు అవినాష్, సాయి కుమార్‌లు ఫుల్ ఫన్ అందించేందుకు వైల్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఈ ఇద్దరే కాకుండా మరో బ్యూటిఫుల్ హీరోయిన్ని కూడా హౌస్‌లోకి పంపనునట్లు తెలుస్తోంది. స్వాతి దీక్షిత్ అనే హీరోయిన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపనున్నట్టు తెలుస్తోంది.
అయితే వీళ్లు తొలివారం నామినేషన్ తరువాత వెళ్తారా?? లేక గతంలో మాదిరి మూడు నాలుగు వారాల్లో వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందా అనేది ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అనుమానమే. ఒకవేళ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వాలంటే వారందరినీ 14 రోజులు క్వారంటైన్లో ఉంచి తర్వాత ఎంట్రీ ఇస్తారు.