Bigg Boss 7 Telugu 4th week elimination contestant details Rathika Rose, Teja eliminated. 4th Week Voting Results Bigg Boss Telugu 7, Bigg Boss 7 Telugu Elimination This week, Bigg Boss Telugu 7 fourth week elimination contestant,
బిగ్ బాస్ తెలుగు 7 నాలుగో వారం చివరి దశకు చేరుకుంది. ఈవారం ఎలిమినేషన్ కి హౌస్ లో నుండి ఆరుగురు నామినేట్ కాగా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్టా పుల్టా సీజన్‌గా ప్రమోట్ అయిన బిగ్ బాస్ తెలుగు 7 ప్రేక్షకులకు అందమైన టాస్కులతో వినోదాన్ని అందిస్తున్నారు. బిగ్ బాస్ కొత్త టాస్క్‌లు మరియు రూల్స్ బాగా వచ్చాయి, కొన్ని ఎలిమినేషన్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
ఇక ఎలిమినేషన్ (elimination) విషయానికి వచ్చేటప్పటికి బిగ్ బాస్ 7 హౌస్ నుండి మొదటివారం కిరణ్ రాథోడ్, రెండోవారం షకీలా, అలాగే మూడో వారం దామిని ఎలిమినేట్ కాక, ఈవారం హౌస్ నుండి బయటకు వెళ్ళటానికి నామినేషన్ లో ఆరుగురు ఉన్నారు,. అయితే వీరిలో రతిక అలాగే టేస్టీ తేజ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
బిగ్ బాస్ ఓటింగ్ అలాగే ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న ఓటింగ్ ప్రకారం రతిక (Rathika Rose) అలాగే టేస్టీ తేజ చివరి రెండు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ టేస్టీ తేజ కంటే రతిక చివరి స్థానంలో ఉండటం వల్ల ఇప్పుడు బిగ్ బాస్ ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేది చూడాలి. బిగ్ బాస్ హౌస్ మొదటి నుండి లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది మరి ఈసారి టేస్టీ తేజ ఎలిమినేట్ అవుతాడా లేదంటే యధావిధిగా రతి కానీ ఎలిమినేట్ చేస్తారా అనేది ఇంకో రెండు రోజుల్లో తేలబోతుంది.