bigg boss 7 telugu 6th week elimination, Bigg Boss 7 Telugu this week elimination contestant, Bigg Boss 7 Telugu Voting result, Hot beauty Shobha Shetty eliminated from Bigg Boss 7 Telugu,
బిగ్ బాస్ 7 తెలుగు ఆరో వారం చివరి దశకు చేరుకుంది.. ఈ వారం మొత్తం టాస్కులు తో బిగ్ బాస్ రసవత్తరంగా మారింది.. దానితోపాటు కొత్తగా వచ్చిన హౌస్ మేట్స్ కూడా టాస్క్ లో పోటీ పడేటప్పటికీ ఈ వారం మొత్తం ఫన్నీ ఫన్నీగా అలాగే కొన్ని గొడవలతో ముగింపు దశకు చేరుకుంది. ఇక బిగ్ బాస్ ఎలిమినేషన్ (Elimination) విషయానికి వచ్చేటప్పటికి ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్లడానికి ఏడుగురు నామినేట్ అవ్వడం జరిగింది. అయితే ఈసారి నాగార్జున ఓటింగ్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా లేదు అంటే ఏదైనా ట్విస్ట్ పెడతారా అనేది చూడాలి.
ఇక బిగ్ బాస్ 7 తెలుగు ఈవారం ఓటింగ్ (Voting) రిజల్ట్ ప్రకారం చూసుకుంటే.. యావర్ అలాగే అమర్ ఎక్కువ శాతం ఓటింగ్ తెచ్చుకొని మొదటి రెండు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తుంది.. అలాగే టేస్టీ తేజ కూడా పోయిన వారం కంటే ఈ వారం ఓటింగ్ మెరుగ్గాని తెచ్చుకున్నారు.. ఇక అమ్మాయిల విషయానికి వస్తే అశ్విన, పూజా మూర్తి ఇంకా శోభాశెట్టి చివరి మూడు స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ సర్ప్రైజ్ ఏమిటంటే ఈవారం బిగ్ బాస్ హౌస్ లోకి నాగార్జున హోలోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టయితే తెలుస్తుంది.
హోలోగ్రామ్ ద్వారా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన నాగార్జున ఈ వారం శోభా శెట్టిని (Shobha Shetty) హౌస్ నుండి ఎలిమినేట్ చేస్తాడు అని సమాచారం అయితే అందుతుంది. లేదా బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ ఇచ్చి కొత్తగా వచ్చిన హౌస్ మేట్స్ నుండి ఎవరినైనా ఎలిమినేట్ చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ ఆదివారం (Bigg Boss 7 Telugu) జరగబోయే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో ఏం జరుగుతుందో చూద్దాం.