Bigg Boss Telugu This week Elimination, Bigg Boss 7 Telugu 9th week elimination, Tasty Teja eliminated from Bigg Boss 7 telugu house, 9th week voting result. BB7Telugu
బిగ్ బాస్ 7 తెలుగు ఇప్పుడు రసవత్తరంగా మారింది.. ప్రతిరోజు ఏదో ఒక కొత్త టాస్క్ లతో బిగ్ బాస్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.. అలాగే 7 వారాలపాటు లేడీ కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది. 8 వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఆట సందీప్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.. అయితే 9వ వారం నామినేషన్ ప్రక్రియలో హౌస్ నుండి బయటికి వెళ్ళటానికి 8 మంది ఎలిమినేషన్ లో ఉన్న విషయం కూడా తెలిసిందే.. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు.. ఓటింగ్ రిజల్ట్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక 9 వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేషన్ అవటానికి అమర్ దీప్, అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, టేస్టీ తేజా, భోలే షావలి, రతిక రోజ్ అలాగే శోభాశెట్టి నామినేషన్ లో ఉన్నారు. గత రెండు వారాలుగా శోభ శోభ కి లీస్ట్ ఓటింగ్ వచ్చినప్పటికీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటాలో తనని పక్కనపెట్టి నాయిని పావని అలాగే ఆట సందీప్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది.. ఇక శోభ ఎలిమినేషన్ లిస్టులో ఉండేసరికి అందరూ తనే ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు.. కానీ అనూహ్యంగా ఈ వారం నామినేషన్ లో ఉన్న శోభ శెట్టి బిగ్ బాస్ కెప్టెన్ అవటం జరిగింది.
బిగ్ బాస్ కావాలనే ఇవన్నీ చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో పలుగురు కామెంట్స్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ 9 వారం ఓటింగ్ రిజల్ట్ చూసుకుంటే.. అమర్ దీప్, యావర్‌లు టాప్ ఉండగా చివరి మూడు స్థానాల్లో ప్రియాంక, టేస్టీ తేజ అలాగే శోభ ఉన్నారు. అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ వారం టేస్టీ తేజ హౌస్ నుండి ఎలిమినేషన్ జరుగుతుందని లీకైతే అందుతుంది.
టేస్టీ తేజ అలాగే శోభ లవ్ ఎఫైర్ హౌస్ లో జరుగుతున్న విషయం తెలిసిందే మరి బిగ్ బాస్ మేనేజ్మెంట్ కోటా ప్రకారం శోభాని సేవ చేసినప్పుడు చివరి మూడు స్థానాల్లో ఉన్న ప్రియాంక లేదా టేస్టీ తేజ ఎలిమినేషన్ జరగాల్సి ఉంటుంది. మరి బిగ్ బాస్ ఈవారం ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడు మరికొన్ని గంటల్లో తేలబోతుంది.