Bigg Boss 7 Telugu Weekend Review: బిగ్ బాస్ 7వ సీజన్ లో మార్పులు ఒక్కొక్కటి బయటికి వస్తూ ఉన్నాయి. శనివారం నాడు జరిగిన షోలో నాగార్జున కొంతమంది హౌస్ మేట్స్ మీద ఫైర్ అవటం జరిగింది దానితోపాటు వాళ్ళ ఆట పనితీరు అలాగే హౌస్ మేట్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఎప్పటిలాగానే వివరించడం జరిగింది. మొదట, ప్రిన్స్ యావర్ మరియు సందీప్ నాకు సంబంధించిన వీడియో అని అందరికీ చూపిస్తారు. ప్రియాంక, అమర్‌దీప్‌లు కూడా యావర్ చేసిన పనిని సమర్థించరు.
Bigg Boss 7 Telugu Weekend Review: అదేవిధంగా సందీప్ కూడా వార్నింగ్ ఇచ్చి తన తన షర్టును కూడా తీయించి నువ్వు కూడా అవి వాడటం వల్లే నీకు ఇలా బాడీ వచ్చిందా అంటూ ఎద్దేవ చేయటం జరిగింది. ఈ తంతు అయిపోయిన తర్వాత, బిగ్ బాస్ 7వ సీజన్ రెండో హౌస్‌మేట్‌ని శనివారం జరిగిన షోలో నాగార్జున ప్రకటించడం జరిగింది. ఈ సీజన్‌లో శివాజీని రెండో హౌస్‌మేట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత కంటెస్టెంట్ల ఆటను నాగార్జున కింగ్స్ మీటర్ ద్వారా విశ్లేషించారు.
శివాజీ హౌస్ లో ఆట తీరని మెచ్చుకోగా మరియు అతను కెప్టెన్‌గా మాయా అస్త్ర టాస్క్‌లో చేసిన విధానం బాగుంది అన్నారు. అయితే తన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలని, బిగ్ బాస్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యాఖ్యానించవద్దని చెప్పాడు. అతనికి 4 వారాల అడిక్షన్ పాస్ ఉన్నందున అతని బ్యాటరీ దెబ్బతింటుంది కాబట్టి జాగ్రత్తగా ఆడమని నాగార్జున అతనికి సూచించాడు.
ఆ తర్వాత, నాగార్జున అమర్‌దీప్ ఆటలో మెరుగ్గా ఉన్నాడని ప్రశంసించాడు, అయితే అతను అసంబద్ధమైన విషయాల గురించి మాట్లాడినందున నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అతను షకీలాను కూడా ప్రశంసించాడు, అయితే ఆమె వయస్సు గురించి ప్రస్తావించవద్దని చెప్పాడు.

అలాగే శోభ, శుభశ్రీ, తేజ, దామిని, రతికలు తమ ఆటతీరును మెరుగుపరుచుకోవాలని చెప్పాడు. ముఖ్యంగా రతిక తన ఆటను జాగ్రత్తగా చూసుకోవాలని, జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఆటను జాగ్రత్తగా ఆడాలని చెప్పడం జరిగింది. ఇక నామినేషన్ లో ఉన్న వారి విషయానికి వస్తే శనివారం రోజు అయితే అమర్ దీప్ సేఫ్ అని ప్రకటించడం జరిగింది. ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు ఎవరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారో మరి సీక్రెట్ రూమ్ ఆప్షన్ ఉందా లేదా అనేది తెలియాల్సి ఉంది.