తెలుగు బిగ్ బాస్-4 ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షో నిర్వాహకులు నాగార్జున హోస్ట్ గా చేస్తునట్టు ప్రోమోలను కూడా విడుదల చేసారు. ఈసారి కరోనా కారణంగా కంటెస్టెంట్స్ ను రెండు వారాల ముందుగానే పార్క్ హయత్ లో ఐసోలేషన్ చేశారు. ఐసోలేషన్ కు ముందే అందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కూడా రెగ్యులర్ గా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఈ సీజన్లో జబర్దస్త్ కెవ్వు కార్తీక్, సింగర్ నోయల్ సేన్, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, నందు యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే మొదటి పరీక్షలో అందరు కూడా నెగటివ్ రిపోర్ట్ తో బయటకు వచ్చారు. ఇటీవల జరిపిన రెండవ సారి టెస్ట్ లో ఒక సింగర్ కు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట.
కంటెస్టెంట్ కు కరోనా రావడంతో నిర్వాహకులు టెన్షన్ లో ఉన్నారట. అయితే షో ప్రారంభం అయ్యే సమయానికి అతడికి నెగటివ్ వస్తే ఖచ్చితంగా అతడిని తీసుకుంటారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అతడు ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్ ను కలవలేదట. కనుక వారి విషయంలో ఎలాంటి టెన్షన్ అయితే లేదు అంటున్నారు.