సీఎం జగన్‌పై నటి కరాటే కల్యాణి సంచలన వ్యాఖ్యలు..!

0
676
bigg boss fame karate kalyani sensational comments on ys jagan over tirumala declaration issue-min

YS Jagan: karate kalyani: బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్, సినీ నటి కరాటే కళ్యాణి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై సంచలన కామెంట్స్ చేశారు. ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన తిరుమల డిక్లరేషన్ ఇష్యూపై ఆమె స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను బీజేపీలో చేరతానని కరాటే కల్యాణి ప్రకటించారు. పార్టీలో చేరిన తర్వాత.. అన్ని అంశాలపై స్పందిస్తానని స్పష్టం చేశారు.

ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఎవరూ ఆపరని తిరుమలకి వెళ్లారా?? ఆయన క్రిస్టియన్ అని అందరికీ తెలుసు.. మధ్యలో ఆయన హిందూమతం తీసుకున్నారని.. శారదా పీఠం దగ్గర గంగలో మునిగారు అని ఫొటోల్లో చూశాం కానీ.. నాకు తెలుసు మొదటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్‌ని బ్రేక్ చేయడం తప్పు. అది ఎవరైనా కావచ్చు.. సీఎం అవ్వొచ్చు.. పీఎం అవ్వచ్చు. ఎవరికైనా తిరుమల రూల్స్‌ని బ్రేక్ చేసే హక్కులేదని స్పష్టం చేశారు. భారత పౌరురాలిగా ప్రశ్నించడం తన హక్కు అంటూ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు కల్యాణి.

ఇక త్వరలోనే తాను బీజేపీలో చేరతానని కరాటే కల్యాణి ప్రకటించారు. పార్టీలో చేరిన తర్వాత.. అన్ని అంశాలపై స్పందిస్తానని స్పష్టం చేశారు. జెరూసలేంకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ అడిగితే ఇస్తారు కదా.. మరి తిరుమలలో ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. వైఎస్ జగన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా చేయడం తప్పని విమర్శించారు కల్యాణి. ఏపీలో దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మీ దేవుళ్ల జోలికి మేం రావడం లేదని.. మా దేవుళ్ల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

గోవిందా.. గోవిందా.. అని కొన్ని కోట్ల మంది గోవిందుడ్ని కొలుస్తారు.. ఆ కోట్ల మందిలో మీకు ఓట్లు వేసిన వాళ్లు ఉన్నారు.. వాళ్ల మనోభావాల్ని ఎందుకు దెబ్బతీశారు. నియంతపాలన అని దేవుడి ముందు ప్రదర్శించకూడదు.. ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. ఇలా చేయడం ఖచ్చితంగా తప్పు.. అంటూ బీజేపీ పార్టీలో చేరకముందే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై సంచలన కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి.

Previous articleI do not smoke, do not take drugs – Rakul Preet Singh
Next articleThese are the Yash Solid Workouts for KGF2!