రంజిత బాటలో బిగ్ బాస్ భామ..నిత్యానంద సేవకి పోతా.!

0
362
Bigg Boss Fame Meera Mitun Says She Wants To Visit Nithyananda's Country Kailasa

వివాదాస్పద స్వామిజీ నిత్యానందంపై మరో నటి మనసు పారేసుకుంది. ఇది భక్తో లేక ఏంటో తెలియదు కాని.. స్వామివారి సేవకు నేను కూడా సిద్దం అంటూ ప్రకటించేసింది. నిత్యానంద రోజురోజుకు మరింత శక్తిమంతంగా మారుతున్నారని పేర్కొంది.

నిత్యానందకు సంబంధించిన బిదాడి ఆశ్రమంలో నటి రంజిత ఏడాదికి పైగా ఉందని.. అప్పుడు స్వామి వారికి కావాల్సిన అన్ని కార్యక్రమాలను సమర్పించిందని నిత్యానందపై పోలీసులు జరిపిన విచారణలో బయటకు వచ్చింది. ఆమెతోనే కాదు.. 15 మందికి పైగా మహిళా భక్తులతో రాసలీలలు సాగించినట్టుగా స్వయంగా నిత్యానందే ఒప్పుకున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

స్వామి వారిపై ప్రేమ కురిపిస్తూ.. అందరూ కలిసి ఆయనను తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది మిరా మిథున్. తాను త్వరలోనే నిత్యానంద కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలిపిన నటి.. ‘లాట్స్ ఆఫ్ లవ్’ అని ట్వీట్ చేసింది. భారత్ నుంచి పరారైన నిత్యానంద ఓ దీవిని కొనుగోలు చేసి, దానిని ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస’ పేరిట ప్రత్యేక దేశంగా ప్రకటించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ఏర్పాటు చేసి కరెన్సీని కూడా ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. కాగా, మీరామిథున్ చేసిన ట్వీట్ కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here