Bigg Boss lady Nandini Rai hot bollywood political drama movie chance
Bigg Boss lady Nandini Rai hot bollywood political drama movie chance

నందినీ రాయ్.. 2011 నుండి సినిమా ఇండస్ట్రీలో ఉంది. 2015 లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’ లో హీరోయిన్ గా నటించి కాస్తో.. కూస్తో గుర్తింపు తెచ్చుకుంది. అయినా కూడా ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్ బాస్ లో సందడి చేయడం కూడా ఆమెకు కెరీర్ లో పెద్దగా ప్లస్ కాలేదు. సిల్లీ ఫెల్లోస్ సినిమాలో ‘పుష్ప’ క్యారెక్టర్ లో నవ్వులు పూయించినా సినిమా మాత్రం హిట్ కాలేదు. టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేని తరుణంలో నందినీ రాయ్ కి బాలీవుడ్ లో చేసే అవకాశం దక్కింది.

నందినీ రాయ్ కు పొలిటికల్ డ్రామాలో నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ నేపథ్యంలో జరిగే కథలో నందినీ రాయ్ కూడా ఒక లేడీ పొలిటీషియన్ గా నటించనుంది. ఈ క్యారెక్టర్ చేయడానికి తాను ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నానని.. ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నానని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ క్యారెక్టర్ అంత ఈజీగా తనకు దక్కలేదని చెబుతోంది నందినీ రాయ్. లుక్ టెస్టు పూర్తయ్యాక నాలుగు రకాల ఆడిషన్స్ తాను చేశానని.. యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానని నందినీ రాయ్ చెప్పుకొచ్చింది. ఈ సినిమాకు హుస్సేన్ దర్శకత్వం వహిస్తున్నారు. నందినీ రాయ్ బాలీవుడ్ లో సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

1.

2.

3.