Bigg Boss season 1 winner Shiva Balaji complaints in HRC over online classes

Shiva Balaji: నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. బిజినెస్ మేన్‌గా తన సత్తా చూపిస్తూ మధ్యలో బిగ్ బాస్ విన్నర్ కూడా అయిపోయాడు శివ బాలాజీ. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి శివ బాలాజీ ఓ స్కూల్‌పై సీరియస్ అయ్యాడు. ఏకంగా హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించాడు.

క‌రోనా వైర‌స్ వ్యాప్తి కార‌ణంగా స్కూళ్ల‌న్నీ మూత‌బ‌డ్డాయి. రెండు, మూడు నెల‌లు చూసినా క‌రోనా వ్యాప్తి త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోయేస‌రికి ప్ర‌భుత్వం పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించ‌మ‌ని ఆదేశ‌మిచ్చింది. దీంతో అప్ప‌టి నుంచి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల హీరో శివ‌బాలాజీ పిల్ల‌లు ఆన్‌లైన్ క్లాసుల‌కు అటెండ్ కాకుండా ఉండేందుకు తమ ఐడీల‌ను ‘మౌంట్ లిటేరా జీ స్కూల్’ బ్లాక్ చేసింద‌ని ‘మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ ‘(హెచ్ఆర్‌సీ)లో ఫిర్యాదు చేశారు. దీని గురించి యాజ‌మాన్యాన్ని హెచ్చ‌రిస్తే బెదిరిస్తున్నార‌ని వాపోయారు.ఈయన చేసిన కామెంట్స్‌తో ఒక్కసారిగా ఆ స్కూల్ పేరు హాట్ టాపిక్ అయిపోయింది.

మీరు పిల్లలకు క్లాసులు తీసుకోవడం కాదు.. నేను రివర్స్‌లో మీకు క్లాసులు తీసుకుంటానంటూ సీరియస్ అయ్యాడు శివ బాలాజీ. తెలుగులో చాలా సినిమాలు చేసాడు ఈయన. ఇప్పుడు పూర్తిగా తన పర్సనల్ పనులతోనే బిజీగా ఉన్నాడు ఈయన. ఉన్నట్లుండి ఇలా హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాడు చేసి సంచలనం సృష్టించాడు.