Bigg Boss Telugu Season 5 హౌస్‌లో కంటెస్టెంట్ల సంద‌డి స్టార్ట్..!

0
118
Bigg Boss Season 5 Contestant details and biography

Bigg Boss Telugu Season 5 Contestant:తెలుగు ప్రేక్ష‌కులు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజ‌న్ 5 (Bigg Boss Telugu Season 5) షో సంద‌డి మొద‌లైంది. ఇవాళ సాయంత్రం 6 గంట‌ల‌కు గ్రాండ్ గా ప్ర‌సార కార్య‌క్ర‌మం ప్రారంభం కాగా..తొలి కంటెస్టెంట్ గా సిరి హ‌న్మంత్ గ్రాండ్ గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

క్రాక్ మూవీలోని ఐటెం సాంగ్ ‘చీమకుర్తిలో కన్ను తెరిచా.. చినగంజాంలో నా వళ్ళు విరిచా..’ సాంగ్ తో సిరి హన్మంత్ ఎంట్రీ ఇచ్చారు. ఇచ్చిన టాస్క్ చక్కగా పూర్తి చేసిన సిరి హన్మంత్… ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సిద్ధం అంటూ.. ప్రామిస్ చేశారు. ఈ సీజన్ కి గాను హౌస్ లో అడుగుపెట్టిన మొదటి కంటెస్టెంట్ సిరి హన్మంత్ అయ్యారు.

Bigg Boss Season 5 Contestant Siri Hanmanth

2. కంటెస్టెంట్ గా వీజే స‌న్నీ (VJ Sunny)

Bigg Boss Season 5 Contestant VJ Sunny

ఇక రెండవ కంటెస్టెంట్ గా బుల్లితెర సీరియల్ నటుడు విజయ్ సన్నీ ఎంటర్ అయ్యాడు. అల్లు అర్జున్ సరైనోడు చిత్రంలోని టైటిల్ సాంగ్ తో విజయ్ సన్నీ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. తన డ్రీమ్ గాళ్ ఫొటోను డ్రాయింగ్ వేయ‌మ‌ని స‌న్నీని అడిగాడు. స‌న్నీ డ్రాయింగ్ వేసి ఇంట్లోకి వెళ్ల‌గా..అప్ప‌టికే హౌస్ లో ఉన్న సిరి హ‌న్మంత్ అత‌డికి స్వాగ‌తం ప‌లికింది.

3. కంటెస్టెంట్ గా ల‌హ‌రి (Lahari):

Bigg Boss Season 5 Contestant Lahari

మూడో కంటెస్టెంట్‌గా ల‌హ‌రి ఎంట్రీ ఇచ్చింది. ల‌హ‌రి యాంకర్, న్యూస్ రీడ‌ర్, మోడ‌ల్‌గా , జ‌ర్న‌లిస్టు మాత్ర‌మే కాకుండా న‌టి కూడా. `అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ లహరి శరి. ప్రోమోలో యాటిట్యూడ్‌ చూపించి అదరహో అనిపించింది. అంతేకాదు ఈ అమ్మడు నాగ్‌కి బిస్కేట్లు వేసింది.

4. కంటెస్టెంట్ గా శ్రీరామ చంద్ర ( Sreerama Chandra)

Bigg Boss Season 5 Contestant Sreerama Chandra

2010లో ఇండియ‌న్ ఐడ‌ల్ షోలో విన్న‌ర్ గా నిలిచి పాపుల‌ర్ అయ్యాడు శ్రీరామ చంద్ర‌. వివిధ భాష‌ల్లో 500కు పైగా పాట‌లు పాడిన ఈ యువ సింగర్ బిగ్ బాస్ షోతో ఎలా అరిస్తాడో చూడాలి.

5. కంటెస్టెంట్ డాన్స్ మాస్టర్ అనీ (Anee):

Bigg Boss Season 5 Contestant Anee Master

అంద‌రికి షాక్ ఇస్తూ ఐదో అభ్య‌ర్థిగా బిగ్ బాస్ హౌస్ లోకి వ‌చ్చింది. క్లాస్, మాస్ ఇలా ఏ సాంగ్స్ లో నైనా త‌న డ్యాన్సింగ్ స్టైల్ తో స్టేజ్ ను షేక్ చేస్తుందీ ఈ లేడీ కొరియోగ్రాఫ‌ర్‌. ఇక బిగ్ బాస్ లో ఇప్పటి వరకు అబ్బాయిలు మాత్రమే టైటిల్ గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు కథ వేరు. అమ్మాయిలు గెలవాలి అని అనీ మాస్టర్ అన్నారు.

6. కంటెస్టెంట్ గా లోబో ( Lobo):

Bigg Boss Season 5 Contestant Lobo

ఆరవ కంటెస్టెంట్ గా బుల్లితెర సెలబ్రిటీ, నటుడు లోబో వేదికపైకి రావడం జరిగింది. ఏడు రంగులు ఉంటే రైన్ బో, ఒక రంగు ఉంటే లోబో అంటూ.. నాగ్ లోబో హెయిర్ స్టైల్ ని ఉద్దేశిస్తూ అన్నారు. లోబో డ్రెస్సింగ్ స్టైల్, టాటూలు, బట్టలు చూసి ఇతరులు తండ్రి వద్ద ఏకగతాళిగా మాట్లాడేవారని చెప్పాడు. నాన్న బ్రతికి ఉన్నప్పుడు ఆయనకు సరైన గౌరవం ఇవ్వలేదని, ఆయన లేకపోతే ఆ బాధ ఏమిటో తెలుస్తుందని తెలియజేశారు.

7. కంటెస్టెంట్ గా ప్రియ (Priya)

Bigg Boss Season 5 Contestant Priya

బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో కంటెస్టెంట్ ప్రియా. టాలీవుడ్ లో ప్రియా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా గడుపుతోంది. ఈమె పూర్తి పేరు మామిళ్ల శైల‌జ ప్రియ. 1998లో మాస్ట‌ర్ సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిసింది ప్రియ. ఆ త‌ర్వాత ప‌లు సీరియ‌ల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

8. మోడ‌ల్ జెస్సీ (Jessie) ఎనిమిదో కంటెస్టంట్:

Bigg Boss Season 5 Contestant Jessie

యాడ్స్ లో నటించిన జెస్సీ ప‌లు అవార్డుల‌ను అందుకున్నాడు. ఎంత మంచివాడ‌వురా సినిమాతో సిల్వ‌ర్ స్క్రీన్ పై మెరిశాడు.

9. ట్రాన్స్ జెండ‌ర్ ప్రియాంకా సింగ్ (Priyanka singh )

Bigg Boss Season 5 Contestant Priyanka singh

తొమ్మిదవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ ప్రియాంక ఎంట్రీ ఇచ్చారు. ట్రాన్స్ జెండర్ అయిన ప్రియాంక వేదిక సాక్షిగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అబ్బాయి నుండి అమ్మాయిగా మారడం తాను తీసుకున్న కఠిన నిర్ణయంగా ఆమె అభివర్ణించారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి, ఇంటి నుండి బయటికి వచ్చేసి ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడించారు.

10. ప‌దో కంటెస్టెంట్ గా ష‌ణ్ముఖ్ (Shanmukh)

Bigg Boss Season 5 Contestant shanmukh

10వ కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ వేదికపైకి వచ్చారు. ఇక తన యూట్యూబ్ కెరీర్ గురించి నాగార్జున అడిగారు. మొదట్లో కవర్ సాంగ్స్ చేశానని, తరువాత వెబ్ సిరీస్లు చేయడం జరిగింది. అవి బాగా వైరల్ కావడంతో ఇలా నేడు మీ ముందుకు వచ్చే అవకాశం ఇచ్చిందని షణ్ముఖ్ తెలిపారు.

11. ప‌ద‌కొండ‌వ కంటెస్టెంట్ గా హ‌మిద (Hamida)

Bigg Boss Season 5 Contestant Hamida

ఇప్పటికే ఒక చిత్రంలో నటించి టాలీవుడ్ లో మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్ హమీద. ధగధగ మెరిసే అవుట్ ఫిట్ లో హాట్ అప్పియరెన్స్ తో హమీద స్టేజిపైకి వచ్చింది. ‘రంభ ఓర్వసి మేనకా’ అంటూ అదిరిపోయే ఐటెం సాంగ్ కు పెర్ఫామ్ చేసిన హమీద నాగ్ తో ముచ్చటించింది.

12. పన్నెండో కంటెస్టెంట్ గా న‌ట‌రాజ్ మాస్ట‌ర్ (Nataraj Master) 

Bigg Boss Season 5 Contestant Nataraj Master

ఒంటరిగా ఎదిగాడు డాన్స్ మాస్టర్ నటరాజ్‌. ప్రస్తుతం సౌత్‌లో పాపులర్‌ డాన్స్ మాస్టర్‌గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌5లోకి ఎంట్రీ ఇచ్చాడు నటరాజ్‌. తన భార్య సెనోరిటా ఇప్పుడు 7నెలల ప్రెగ్నెంట్‌. కానీ బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడు. అనంతమైన బాధతో, అనంతరమైన సంతోషంతో వెళ్తున్నట్టు చెప్పాడు.

13. ప‌ద‌మూడో కంటెస్టెంట్ గా స‌ర‌యు (Sarayu)

Bigg Boss Season 5 Contestant Sarayu

యూట్యూబ్ స్టార్, బోల్డ్ బ్యూటీ సరయు ఎంట్రీ ఇచ్చింది. యూట్యూబ్ లో సరయు ఎంత ఫేమస్సో కుర్రాళ్ళకి బాగా తెలుసు. ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ యూట్యూబ్ లో బోల్డ్ డైలాగ్స్ తో కొత్త ట్రెండ్ కు తెరతీసింది సరయు. షార్ట్ ఫిలిమ్స్, స్కిట్స్ ని బోల్డ్ డైలాగులతో చేస్తూ వైరల్ సృష్టిస్తోంది ఈ భామ.

14. కంటెస్టెంట్‌గా విశ్వ (Vishwa)

Bigg Boss Season 5 Contestant Vishwa

నటుడు విశ్వ హౌస్లోకి ఎంటర్ అయ్యారు. ఇక తన ఇంట్రో వీడియోలో విశ్వ తన జీవితం ఆవిష్కరించారు. జీవితంలో తాను ఎన్ని బాధలు పడ్డారో తెలియజేశారు. ఆర్థిక బాధలు, బ్రదర్ మరణం వంటి సంఘటనలు తనను మానసిక వేదనకు గురిచేశాయని, అయితే వాటన్నిటికీ ఎదిరించి నిలిచినట్లు తెలిపారు.

15. కంటెస్టెంట్ గా ఉమాదేవి (Umadevi) 

Bigg Boss Season 5 Contestant Umadevi

ఇక 15వ కంటెస్టెంట్ గా సీరియల్ నటి ఉమాదేవి హౌస్లోకి ప్రవేశించారు. అనేక ఫ్యామిలీ ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. ఇక సీరియల్స్ లో గయ్యాళిగా కనిపించిన ఉమాదేవి నిజంగా ఏమిటో చూపిస్తానని ఉమాదేవి తెలిపారు.

16.  కంటెస్టెంట్ గా మాన‌స్ (Maanas) 

Bigg Boss Season 5 Contestant Maanas

మానస్ కాస్ట్యూమ్, డాన్స్ ని నాగ్ అప్రిసియేట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా చేశావ్, అలాగే నీవు మమ్మీ బాయ్ అని తెలిసింది. హౌస్లో ఉండగలవా అని అడిగారు. ఛాలెంజెస్ అంటే ఇష్టం అన్న మానస్, హౌస్ లో ఉంటానని నాగ్ కి హామీ ఇచ్చారు.

17. కంటెస్టెంట్ గా ఆర్జే కాజల్ (RJ Kajal)

Bigg Boss Season 5 Contestant RJ Kajal

కాజల్ కి మైక్ ఇవ్వడానికి నాగార్జున భయపడ్డారు. కాజల్ ఆర్జే కావడంతో ఆమెకు మైక్ ఇస్తే మాట్లాడుతూనే ఉంటుంది, అన్న అర్థంలో సెటైర్ వేశారు.

18. కంటెస్టెంట్‌గా స్వేత వర్మ (Swetaa Varma)

Bigg Boss Season 5 Contestant Swetaa Varma

సోషల్‌ మీడియాలో, నటిగా పాపులర్‌ అయిన ఈ భామ నాగార్జున ముందు రచ్చ చేసింది. ఎంట్రీతోనే అదిరిపోయే సాంగ్‌తో హౌజ్‌లోకి అడుగుపెట్టింది స్వేత వర్మ. గత సీజన్‌లో `దేత్తడి` హారిక మాదిరిగా ఈ సారి స్వేతని దించినట్టు తెలుస్తుంది.

19. కంటెస్టెంట్‌గా పాపులర్‌ యాంకర్‌ రవి (Ravi)

Bigg Boss Season 5 Contestant Ravi

అదిరిపోయే డాన్స్ తో దుమ్ములేపిన రవిని నాగార్జున ఆట పట్టించాడు. నీకు పెళ్లైన విషయం నాకు చెప్పలేదని ఆటపట్టించాడు. దీనికి యాంకర్ రవి చెబుతూ మూడేళ్ల క్రితమే చెప్పానని తెలిపాడు. ఈ సందర్భంగా తన కూతురు ఇచ్చిన గిఫ్ట్ కి, ఆమె చివరి మాటలకు ఎమోషనల్‌ అయ్యాడు రవి.

 

Previous articleActress Siri Hanmanth Latest stills
Next articleVideo: Suriya unboxes IFFM’s Best Film award for Soorarai Pottru