Bigg Boss Telugu 4 Contestants list and details

Bigg Boss Telugu 4 Contestants list and details: బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 వచ్చేసింది. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు మన్మథుడు నాగార్జున. వరుసగా రెండోసారి బిగ్ బాస్‌కి హోస్ట్ చేస్తూ ‘మాస్క్ ముఖానికి ఎంటర్‌టైన్మెంట్‌కి కాదు’ అంటూ కరోనా పరిస్థితులకు అనుగుణంగా పర్ఫెక్ట్ డైలాగ్ డెలివరీతో ఫుల్ ఎంటర్‌టైన్మెంట్‌ అందించేందుకు బిగ్ బాస్‌ను షురూ చేశారు.

16 మంది కంటెస్టెంట్స్‌ను 16 వారాల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగు పెట్టించారు. అసలు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లేది వీరేనంటూ గత కొన్నిరోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఎట్టకేలకు ఆ సస్పెన్స్‌కు ఆదివారంతో తెరపడింది. అసలు బిగ్‌బాస్‌ 4లో పాల్గొనే కంటెస్టెంట్స్‌ ఎవరంటే…

1. మోనాల్‌గజ్జర్‌:

హీరోయిన్‌ సుడిగాడు, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి వంటి తెలుగు చిత్రాలతో మోనాల్‌ గజ్జర్‌ అందరికీ సుపరిచితురాలే. ఈ గుజరాతీ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ, మలయాళ, గుజరాతీ చిత్రాల్లో నటించారు. పదిహేనేళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడని… అమ్మ పెంచి పెద్ద చేసిందని, ఆమె ఎంతో మిస్‌ అవుతున్నానంటూ మోనాల్‌ గజ్జర్‌ కన్నీళ్లు పెట్టుకుంది.

2.సూర్యకిరణ్‌:

దర్శకుడు.. హీరోయిన్‌ కల్యాణి భర్త. తెలుగులో సత్యం, ధన 51 వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని, బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళుతూ నాలాగే నేను ఉంటానని ఆయన అన్నారు.

3. లాస్య:

యాంకర్‌ లాస్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. 2009లో ప్రేమ వివాహం చేసుకున్నానని, రెండు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి తన భర్తనే కుటుం సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నానని లాస్య చెప్పింది. తనకు దక్ష్‌ కొడుకంటే ప్రాణమని, బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లడం వల్ల వాడిని చాలా మిస్‌ అవుతున్నానని ఆమె అన్నారు.

4. అభిజీత్‌:

లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌ చిత్రంలో హీరోగా నటించిన అభిజీత్‌.. నాలుగో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. అభిజీత్‌ను నాగ్‌ రెండు చిలిపి ప్రశ్నలు వేశారు. కాజల్‌, పూజా హెగ్డే, తమన్నాలలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవరితో డేట్‌కు వెళతావు, ఎవరిని ముద్దు పెట్ఠుకుంటావు అని అడగ్గా కాజల్‌తో డేట్‌కు వెళతానని, పూజా హెగ్డేను పెళ్లి చేసుకుంటానని, తమన్నాను ముద్దు పెట్టుకుంటానని అన్నారు. అలాగే మోనాల్ గజ్జర్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్‌ ఫొటోలను చూపించి అదే ప్రశ్న వేయగా.. మోనాల్‌ను పెళ్లి చేసుకుంటానని, ఎందుకంటే ఆమె ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తోందని అన్నారు.

5. జోర్‌దార్‌ సుజాత:

తెలంగాణ యాసతో పాపులర్‌ అయిన సుజాత.. తాను జీవితంలో చాలా కష్టనష్టాలను ఫేస్‌ చేశానని, ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చిన తాను చిన్నగా యాంకర్‌గా మారానని చెప్పారు. నాగార్జునను బిట్టు అని పిలిచారు.

6. మెహబూబా దిల్‌సే:

టిక్‌టాక్‌లో ఫేమస్‌ అయిన మెహబూబా దిల్‌సే గుంటూరు కుర్రాడు. సినిమా రంగంపై ప్యాషన్‌తో హైదరాబాద్‌ వచ్చానని చెప్పారు మెహబూబా.

7. దేవీ నాగవల్లి:

న్యూస్‌ యాంకర్‌, రిపోర్టర్‌గా దేవీ నాగవల్లీ అందరికీ సుపరిచితురాలే. డబ్బులు అవసరం కాబట్టే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రావడానికి నిర్ణయించుకున్నానని, పెళ్లి అయ్యిందని, భర్తనుండి విడిపోయానని దేవి చెప్పారు. తనకు ఆరేళ్ల బాబు ఉన్నాడని కూడా ఆమె అన్నారు.

8. దేత్తడి హారిక:

యూట్యూబ్‌లో స్టార్‌గా ఎదిగిన హారిక.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

9. సయ్యద్‌ సోహైల్‌ రియాన్:

టీవీ, సినిమాల్లో నటించిన సయ్యద్‌.. తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

10.అరియానా గ్లోరి:

తాను బోల్డ్‌ అమ్మాయినని, మనసులో ఏదీ దాచుకోనని చెప్పే జెమిని కెవ్వుకేక యాంకర్‌ అరియానా పదో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. కంటెస్టెంట్స్‌ 9 సయ్యద్‌, 10గా వచ్చిన అరియానాలను రెగ్యులర్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి కాకుండా స్పెషల్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపారు బిగ్‌బాస్‌.

11.అమ్మా రాజశేఖర్‌:

డ్యాన్స్‌ మాస్టర్‌, డైరెక్టర్‌గా అమ్మా రాజశేఖర్‌ అందరికీ సుపరిచితుడే.

12.కరాటే కల్యాణి:

తనకు పిల్లలు లేరని, ఓ బాబుని దత్తత తీసుకుని పెంచుకుంటున్నానని, హరికథలు చెప్పడంలో కరాటే కల్యాణి చాలా ఫేమస్‌. బిగ్‌బాస్‌పై స్టేజ్‌పైనే ఓ హరికథ చెప్పి ఎంట్రీ ఇచ్చారు కల్యాణి.

13.నోయెల్‌:

సింగర్‌, నటుడుగా నోయెల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నేను బయట ఎలా ఉంటానో, ఇంట్లో వాళ్లకి తెలియదని, ఈ షో ద్వారా తన కుటుంబ సభ్యులకు తనేంటో తెలుస్తుందని నోయెల్‌ అన్నారు.

14. దివి:

మోడల్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసి కొన్ని సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌ల్లో నటించిన తనకు బిగ్‌బాస్‌ మంచి బ్రేక్‌ అవుతుందని దివి భావిస్తుంది

15. అఖిల్‌:

సినీ నటుడు అఖిల్‌ పదిహేనేవ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. సిసింద్రీ సినిమా విడుదలైన తర్వాత రోజున పుట్టిన తనకు ఇంట్లో వాళ్లు అఖిల్‌ అనే పేరు పెట్టారని, ఎప్పుడూ ఫిట్‌గా ఉండటానికి ఇష్టపడతానని అన్నారు.

16. గంగవ్వ:

యూ ట్యూబ్‌ స్టార్‌ గంగవ్వ చివరి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈమె వయసు 58 ఏళ్లు. ఇంత వయసున్న వ్యక్తి కంటెస్టెంట్‌గా రావడం ఇదే తొలిసారి. తెలంగాణకు చెందిన ఈమె జీవితంలో తాను ఎదుర్కొన్న కష్టాలను చెప్పారు. బిగ్‌బాస్‌లో గెలిస్తే ఆ డబ్బుతో సొంత ఇల్లు కట్టుకుంటానని చెప్పారీమె.