బిగ్ బాస్ 4 గ్రాండ్ ఫైనల్ ప్రత్యేకతలు.. విన్నర్ – రన్నర్.. లిస్ట్ ఇదే

0
596
Bigg Boss Telugu 4 grand finale special guest and winner details here

బిగ్ బాస్ 4 ఫైనల్ కి అంతా రెడీ అయ్యింది. సోషల్ మీడియాలో విన్నర్ ఎవరు అంటే.. అభిజితే అంటున్నారు. కొంత మంది అయితే.. గత మూడు సీజన్ లలో అబ్బాయిలే విన్నర్ గా నిలిచారు కాబట్టి.. ఈసారి అమ్మాయి విన్నర్ గా నిలుస్తుంది. ఆ లెక్కన అరియానా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ రియాలిటీ ప్రదర్శన ఈరోజు (డిసెంబర్ 20) గ్రాండ్ ఫైనల్ తో ముగుస్తుంది. గెస్ట్ షోలు.. డ్యాన్సింగులు.. ప్రత్యేక ప్రదర్శనలతో ఈ రాత్రి జరిగే ఈవెంట్ కి ప్రత్యేక కళ తేనున్నారు.

ప్రత్యేకతలు:
చిరంజీవి, నాగచైతన్య, సాయిపల్లవి, అనిల్ రావిపూడి, గెస్ట్ లు కాగా, లక్ష్మీరాయ్, మెహ్రీన్ అలాగే ప్రణతి సుభాష్ డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ చేయనున్నారు. మరో విషయం ఏంటంటే.. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ లైవ్ మ్యూజిక్ స్టేజ్ పర్ ఫార్మెన్స్ ఉంటుంద. గ్రాండ్ ఫైనల్ కోసం ఒక ప్రత్యేక సంగీత కచేరీలో ప్రదర్శన ఇస్తాడు. ఈ రాత్రి జరిగే గ్రాండ్ ఫైనల్ లో కమ్ముల `లవ్ స్టోరి` స్టార్లు నాగ చైతన్య- సాయి పల్లవి ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్నారు. ఈ జంట కొంతమంది ఫైనలిస్టులను కూడా తొలగించే పనిని వారికి అప్పగించే అవకాశం ఉంది.  ఈ లెక్కన ఫైనల్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారు. మరి.. టీఆర్పీ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

విన్నర్ – రన్నర్:
తెలుగు బిగ్ బాస్ కు లీకుల పీడ తప్పడం లేదు. తొలి సీజన్ పూణెలో జరగడంతో లీక్ లు అనేవి లేకుండా షో పూర్తయింది. ప్రస్తుతం జరుగుతున్న నాలుగో సీజన్ అయితే ఏకంగా వీక్ డేస్ టాస్క్ లు మరియు విన్నర్ ల వివరాలు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. అంతెందుకు కెప్టెన్ ఎవరు కాబోతున్నారనే విషయం కూడా లీక్ అవుతోందంటే పరిస్థితి ఎంత ఛండాలంగా ఉందో అర్థం అయిపోతుంది. లీకులకు చెక్ పెట్టే యోచనలో బిగ్‌బాస్.. విన్నర్ రివీల్ లైవ్‌లో చేస్తారట..

ఫైనల్ లో ఉన్న అఖిల్ విన్నర్ నేనే అంటూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సోహెల్ ఇక్కడ వరకు రావడమే లక్ గా భావిస్తున్నాను. విన్నర్ కాకపోయినా ఫరవాలేదు అంటున్నారు. అరియానా కూడా కెరీర్ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలే అయ్యింది. ఈ నాలుగేళ్లలో బిగ్ బాస్ వరకు రావడం అంటే మాటలు కాదు. ఇది చాలు అన్నట్టుగా ఆమె కూడా సంతృప్తి వ్యక్తం చేస్తుంది. హారిక కూడా సంతృప్తిగానే ఉంది.

తెలుగు బిగ్ బాస్ 4 నుండి మిగిలి ఉన్న ఆ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ కూడా బయటకు వచ్చేశారని సమాచారం అందుతోంది. టాప్ 5లో ఉన్న వారిలో నెం.5 గా హారిక మరియు నెం.4 గా అరియానా ఎలిమినేట్ అయ్యారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో ఒకొక్కరు చొప్పున ఎలిమినేట్ చేస్తారనే అనుకున్నారు. కాని టీమ్ ప్లాన్ చేంజ్ చేసింది. అనూహ్యంగా శనివారం సాయంత్రం సమయంలోనే కొంత భాగంను షూట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి..

ఆ ఇద్దరు ఎలిమినేట్ అవ్వడంతో నేడు బిగ్ బాస్ హౌస్ లో అఖిల్ అభిజిత్ సోహెల్ లు మాత్రమే ఉన్నారు. ఈ ముగ్గురిలో విజేత విషయంలో కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అఖిల్ నెం.3 గా నిలువ నుండగా అభిజిత్ విజేతగా సోహెల్ రన్నర్ గా నిలువబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ -4 విన్నర్ ఎవరనేది వెల్లడించే విషయంలో మాత్రం అస్సలు లీకుల గొడవ రాకూడదని షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేటి మద్యాహ్నం రెండు లేదా మూడు గంటల నుండి షో షూటింగ్ ప్రారంభిస్తారని అంటున్నారు. విజేతను లైవ్ లో ప్రకటించే అవకాశం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి షో ఫార్మెట్ ను నిర్వాహకులు మార్చి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

[IT_EPOLL id=”55587″][/IT_EPOLL]

 

 

Previous article‘సోలో బ్రతుకే సో బెటర్’ ట్రైలర్ విడుదల
Next articleWho according to you, will win the Bigg Boss title