మొదటివారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారంటే..!

0
68
bigg boss telugu 5 first week nomination list

Bigg Boss Telugu 5: టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో ‘Bigg Boss Telugu 5’ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ గేమ్ షోను మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో ఈసారి బిగ్‌బాస్ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా సెప్టెంబర్ 5న ఘనంగా ప్రారంభమైన బిగ్‌బాస్ సీజన్ 5 షోలో 19 మంది కంటెస్టెంట్లను ఫైనల్ చేశారు నిర్వాహకులు.

ఇక నామినేషన్స్ , ఎలిమినేషన్స్ అనేవి తప్పవు. ప్రతి సోమవారం నామినేషన్స్, అలాగే ప్రతి ఆదివారం ఎలిమినేషన్ ఉంటుంది. అయితే, ఈసారి అనూహ్యంగా ఫస్ట్ టైమ్ 19మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. వీళ్లలో ఫస్ట్ వీక్ ఎవరు నామినేట్ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలాపేర్లు వినిపిస్తున్నాయి. గతసీజన్లో ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఓపెన్ గానే పెట్టారు.

వీళ్లలో యాంకర్ సిరి, యాంకర్ రవి, అనీ మాస్టర్, సరయు, ప్రియాంక సింగ్, నటరాజ్ మాస్టర్, షణ్ముక్ జస్వంత్, ఉమాదేవి, లోబో, వీళ్లు నామినేషన్స్ లోకి వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ వారం నామినేషన్ లిస్ట్ లో నిజంగా వీరు ఉన్నారా.. లేదా.. అనేది తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

Bigg Boss Telugu 5 Check Out First Week Nominated Contestants List

అలాగే విజె సన్నీ, శ్రీరామ్ చంద్ర, జెస్సీ, విశ్వ, ఆర్జే కాజల్, శ్వేతావర్మ, మానస్, లహరి, వీళ్లందరూ ఈవారం సేఫ్ జోన్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి 19మందిలో ఎలిమినేషన్ ప్రోసెస్ ని కూడా డిఫరెంట్ గా చేయబోతున్నారని అంటున్నారు.