బిగ్ బాస్ 5 రెండో వారం నామినేషన్స్ లిస్ట్ ‏

0
990
Bigg Boss Telugu 5 Second week Nomination list

Bigg Boss Telugu 5 Nominations: బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ డే అయిపోగానే అసలైన రచ్చ మొదలవుతుంది. సోమవారం నామినేషన్స్ లో హౌస్ హీటెక్కిపోతుంది. ఒకరినొకరు దెప్పుకుంటూ, తిట్టుకుంటూ, వాళ్ల చేష్టలని చెప్తూ నామినేట్ చేసుకుంటారు. ఈ వారం ఏకంగా ఏడుగురు సభ్యులు నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు మీకోసం!

ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు నేరుగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సిరి హన్మంత్, వీజే సన్నీ, షణ్ముక్ జశ్వంత్, ప్రముఖ నటి ప్రియ, యాంకర్ రవి, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, లహరి, సింగర్ శ్రీరామచంద్ర, సరయు, జస్వంత్, శ్వేతా వర్మ, మానస్ షా, ఉమాదేవి, ఆర్జే కాజల్, లోబో, హమీదా, ఆనీ మాస్టర్, విశ్వలు ఉన్నారు.

సీజన్ ప్రారంభం అయిన మొదటి వారంలోనే సరయు షో నుంచి బయటకు వెళ్లిపోయింది. రెండో వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ రెండు గ్రూపుల మధ్య జరగబోతుందని తెలుస్తోంది. రెండోవారం నామినేషన్స్ లో హమీదా, జస్వంత్, ఆర్జే కాజల్, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, వీజే సన్నీ, లహరి షారిని నామినేట్ అయ్యారట. మరి వీళ్లలో ఎవరు ఎన్ని ఓట్లు సాధిస్తారు అనేది ఆసక్తికరం.

Bigg Boss Telugu 5 Second week Nomination list

ఇందులో గత వారం నామినేట్ అయిన హమీదా, జస్వంత్, ఆర్జే కాజల్‌లు మరోసారి నామినేషన్స్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఇక, మిగిలిన నలుగురు మాత్రం తొలిసారి నామినేషన్స్‌లోకి వచ్చారు. మరి ఇప్పుడు ప్రేక్షకులు ఎవరికి మద్దతిస్తారు? ఎవరిని ఎలిమినేట్ చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.