బిగ్ బాస్ తెలుగు 7 రెండో వరం లో కి అడుగు పెట్టారు. హౌస్ లో 14 కంటెస్టెంట్స్ లో ఇపుడు 13 మంది వున్నారు. బిగ్ బాస్ లో సోమవారం నాటి ఎపిసోడ్ తేడా లేకుండా ప్రతిసారీ అలరిస్తుందనడంలో సందేహం లేదు. ఎప్పటిలాగే ఈ వారం నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ సారి నామినేషన్ వాడి వేడిగా జరిగాయి. ఏకంగా 9 హౌస్ మేట్స్ నామినేట్ అవుతారు.
Bigg Boss telugu 7 second week nomination list
శివాజీ
పల్లవి ప్రశాంత్
రతిక
టేస్టీ తేజా
అమర్ దీప్ చౌదరి
షకీలా
గౌతమ్ కృష్ణ
శోభా శెట్టి
ప్రిన్స్ యావర్
మొత్తానికి పల్లవి ఈ వారం ప్రశాంత్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆయన తీరును పలువురు విమర్శించారు. ముఖ్యంగా, షోలో ప్రశాంత్‌ను విమర్శించినందుకు అమర్‌దీప్ నామినేట్ అయ్యాడు. మరియు గౌతమ్‌ను కూడా పల్లవి ప్రశాంత్ నామినేట్ చేస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించేందుకు పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో చుట్టూ కుక్కలా తిరిగాడు అన్నటు ఆరోపణలు చేస్తారు.
అప్పుడు రతిక బదులిస్తూ, కష్టపడి ఈ అవకాశం వచ్చిందని ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడిగింది. ఆమె ప్రశ్నకి పల్లవి ప్రశాంత్ షాక్ అవుతాడు . ఇన్ని రోజులు పల్లవి ప్రశాంత్ రొమాన్స్ పేరుతో ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చాడు. రతిక ఈ మాట అనడంతో ఒక్క ప్రశాంత్ మాత్రమే కాదు, అందరూ షాక్ అయ్యారు. మొత్తం మీద ఎపిసోడ్ మొత్తం రసవత్తరంగా సాగింది. పల్లవి ప్రశాంత్ కేసుపై కొందరు కనికరం చూపుతుండగా.. మరికొందరు అది జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు.