Bigg Boss Telugu 7 Nominations Week 1: బిగ్ బాస్ షోలో అత్యంత కీలకమైన ఘట్టం నామినేషన్స్.. సోమవారం వచ్చిందంటే హౌస్ లో ఉన్న మెంబర్స్ అందరూ వేసుకున్న మాస్కులు తీసేసి వాళ్ళ నిజస్వరూపాలు బయట పెడుతూ ఉంటారు. అలాగే ఆదివారం రోజు మొదలైన బిగ్బాస్ తెలుగు సెవెన్ షోలో సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. హౌస్ లోకి వచ్చిన 14 మంది కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రక్రియ కొనసాగించారు.
Bigg Boss Telugu 7 Nominations Week 1: బిగ్ బాస్ సీజన్ 7 విభిన్నంగా ఉంటుందని నామినేషన్ ప్రక్రియ కూడా దాని తగ్గట్టే చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఉల్టా పుల్టా ట్విస్ట్‌లు పెద్దగా కనిపించలేదు. ఎప్పుడు జరిగే విధంగానే ఈ సీజన్లో కూడా యాక్టివిటీ రూములో నామినేషన్స్ జరిగాయి వీటిలో.. ఆక్టివిటీ రూమ్ లోకి హీరో శివాజీ రాగా దాని తర్వాత మిగతా హౌస్ మేట్స్ వచ్చి నామినేట్ చేయడం మనం చూస్తాము.
ఈ ఈ నామినేషన్ ప్రక్రియలో శివాజీ ఫైర్ అవ్వటం మనం చూడవచ్చు దానితోపాటు శివాజీ సింగర్ దామిని బాట్ల, గౌతమ్ కృష్ణలను నామినేట్ చేస్తూ కనిపించాడు. తరువాత ప్రియాంక జైన్ నామినేషన్ ప్రక్రియలో పల్లవి ప్రశాంత్, రతికాలను నామినేట్ ఇద్దరిని నామినేట్ చేయడం జరుగుతుంది. హౌస్ మేట్స్ వాదనలో ప్రతి వాదనలతో సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. అందుతున్న సమాచారం మేరకు ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయినట్టు తెలుస్తోంది. వారి లిస్టు ఈ కింద విధంగా ఉంది.
Bigg Boss Telugu 7 first week Nomination list
1. గౌతమ్ కృష్ణ
2. ప్రిన్స్ యావర్
3. పల్లవి ప్రశాంత్
4. రతిక
5. శోభా శెట్టి
6. కిరణ్ రాథోడ్
7. షకీలా