Homeసినిమా వార్తలుబిగ్ బాస్ తెలుగు 7 బ్యూటీ పవన్ కళ్యాణ్ OG లో కీలక పాత్ర.!

బిగ్ బాస్ తెలుగు 7 బ్యూటీ పవన్ కళ్యాణ్ OG లో కీలక పాత్ర.!

Bigg Boss Telugu 7 Subhashree in OG Movie, Bigg Boss 7 Telugu Subha Shree key role in Pawan Kalyan They Call Him OG, OG Movie Shooting update

Bigg Boss Telugu 7 Subhashree in OG Movie: పవన్ కళ్యాణ్ అలాగే సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా OG. ఈ సినిమాకు సంబంధించిన మొదటి వీడియో విడుదల కాగానే సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. 2024 లో వస్తున్న సినిమాల్లో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఇది ఒకటి. అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ బయటికి రానీయకుండా దర్శకుడు అలాగే మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల విషయంలో కూడా ఎవరు ఎక్కడ ఏ విధంగా లీక్ కూడా చెయ్యకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

Bigg Boss Telugu 7 Subhashree in OG Movie: లేటెస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 7 లో ఒకరు అయిన సుభాశ్రీ రాయగురు ఈ సినిమాలో చేసినట్టు రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సుభాశ్రీ రాయగురు 2022లో రుద్రవీణ చిత్రంతో తొలిసారిగా నటించారు. ఈ సినిమా తర్వాత కథా వెనుక కథ మరియు అమిగోస్‌లో కనిపించింది. సుభాశ్రీ బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఒక వీడియో ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పవన్ కళ్యాణ్ తో నటించాను అంటూ చెప్పడం జరిగింది.

ఆమె సినిమా గురించి మాట్లాడుతూ “నాకు పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం. ఆయన అప్ కమింగ్ మూవీ OGలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఆ సినిమా చాలా స్టైలిష్‌గా ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరిచిపోలేను. పవర్ స్టార్ అంటే.. పవర్ జనరేట్ చేస్తున్నట్టే ఉంది. ఊరికే పవర్ స్టార్‌లు అయిపోరు.. ఆయన యాటిట్యూడ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన కళ్లల్లోనే పవర్ ఉంటుంది. వాకింగ్ స్టైల్ అలా చూడాలనిపిస్తుంది.” అని చెప్పుకొచ్చింది.

అయితే ఈ సినిమాలో తను ఎటువంటి పాత్ర చేస్తున్న అనే విషయం గురించి అయితే మాట్లాడలేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయం కొస్తే ఈరోజు హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ ని ప్రారంభించడం జరిగింది. దీనితోపాటు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరి హర వీరమల్లు మందు కూడా అవకాశాన్ని బట్టి షూటింగ్ మొదలు పెడతారని ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY