HomeBigg Boss 7 TeluguBigg Boss Today Promo: మామూలు ట్విస్ట్ కాదు.. పవర్ అస్త్ర లను లాక్కున్న బిగ్...

Bigg Boss Today Promo: మామూలు ట్విస్ట్ కాదు.. పవర్ అస్త్ర లను లాక్కున్న బిగ్ బాస్.

Bigg Boss Telugu 7 Today Promo Review, Bigg Boss This week nomination list, Bigg Boss First Captaincy fight, Bigg Boss Telugu 7 latest news

Bigg Boss Telugu 7 Today Promo Review, Bigg Boss This week nomination list, Bigg Boss First Captaincy fight, Bigg Boss Telugu 7 latest news

బిగ్ బాస్ అందరికీ  ట్విస్ట్ లు మెడ ట్విస్ట్ లు  ఇస్తున్నాడు ఈ సీజన్ 7 లో.  నాలుగు వారాలు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ఐదో వారం అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మొదటి రోజు నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత  ఇప్పుడు రెండవ రోజు పవర్ హస్త్ర సాధించిన శోభాశెట్టి,  ప్రశాంత్  అలాగే సందీప్ దగ్గర నుండి వాటిని తీసుకోవడం జరిగింది. . దానితోపాటు ఈరోజు విడుదల చేసిన ప్రోమోలో బిగ్ బాస్ తెలుగు మొదటి కెప్టెన్సీ టాస్క్ కూడా ప్రారంభించారు.  

కెప్టెన్సీ పోటీల్లో అమర్, సోబాశెట్టి అలాగే శుభశ్రీ ల మధ్య గొడవ జరుగుతున్న విషయం గమనించవచ్చు. దానితోపాటు మరోపక్క శివాజీ కాఫీ గొడవ ఇంకా పోలేదు.. నన్ను హౌస్ లో నుంచి ఎలిమినేట్ చేయండి అంటూ శివాజీ మళ్లీ మొదలు పెట్టడం మనం చూడవచ్చు.. మొత్తం మీద నాగార్జున చెప్పిన విధంగా బిగ్ బాస్ ఈసారి సీజన్ ని బాగానే ట్విస్టులతో నడుపుతున్నట్టు తెలుస్తుంది. 

 ఐదో వారం చేరుకునే సమయానికి, ఇంటిలో   నుండి కిరణ్ రాథోడ్ షకీలా, దామిని అలాగే రతిక  ఎలిమినేట్ అవ్వడం జరిగింది.  మరి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఎవరు వస్తారు అనేది తెలియాల్సి ఉంది.  అందుతున్న సమాచారం మేరకు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి మరో ఆరుగురు ఎంట్రీ ఇస్తారు అని తెలుస్తుంది అయితే దీనిపై ఈ వారంలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.