HomeBigg Boss 7 Teluguశివాజీ లూజ్ టాక్..ప్రిన్స్ రతిక వార్.. రెచ్చిపోయిన శోభాశెట్టి.!

శివాజీ లూజ్ టాక్..ప్రిన్స్ రతిక వార్.. రెచ్చిపోయిన శోభాశెట్టి.!

Bigg Boss Telugu 7 latest news, Rathika Throw ice on prince Yawar pant, Shivaji shocking comments, Shobha Shetty and Gowtham task fight, Bigg Boss 7 promo, Shobha Shetty Hot in Bigg Boss 7 house

Bigg Boss Telugu 7 Updates: బిగ్ బాస్ 7 మొదలుపెట్టి రెండు వారాలు అవుతుంది మొదటి రెండు వారాలు హౌస్ లో ఎటువంటి రచ్చ లేకపోయినప్పటికీ మూడో వారం మొదలు దగ్గర నుండి బిగ్ బాస్ తన ప్లాన్ మొత్తాన్ని మార్చేశారు.. మూడో వారం నామినేషన్ దగ్గర నుండి పవరాస్త్రా వరకు హౌస్ లో హీట్ పెంచేశాడు బిగ్ బాస్.  

Bigg Boss Telugu 7 Today Promo: ప్రస్తుతం హౌస్ లో పోటీ దారులుగా ఉన్న 12 మంది ఒకరి ఒకరు గొడవలతో బిగ్ బాస్ హౌస్ అంతా సందడి సందడిగా ఉంది.  అయితే ఈ వారం నామినేషన్ లో ఏడుగురు ఉన్నారని విషయం తెలిసిందే.. అలాగే బిగ్ బాస్ హౌస్ లో స్థానం సంపాదించేందుకు ముగ్గురికి దక్కించుకునే అవకాశం ఇచ్చారు.. బిగ్ బాస్ దీనిలో భాగంగా ప్రిన్స్ నిన్న టాస్క్ పెట్టడం జరిగింది. మరి బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎలా ఉన్నారో ఒక్కసారి కన్ను వేద్దాం పదండి..  

ఫ్రస్టేషన్ లో శివాజీ లూజ్ టాక్.. (Shivaji Bigg Boss 7)

Hero Shivaji shocking comments on Bigg Boss 7 housemates
Hero Shivaji shocking comments on Bigg Boss 7 housemates

ఇక శివాజీ విషయానికి వస్తే మూడో వారం మొదలైన మొదటి రోజు అనగా సోమవారం తన పవర్ అస్త్రాన్ని అమర్ కొట్టేయడం జరుగుతుంది… దానివల్ల ఉపయోగం లేదు అంటూనే శివాజీ చాలా ఫస్టేషన్కి గురైనట్టు తెలుస్తుంది .. వీళ్ళ అందరితో ఒక ఆట ఆడుకుంటానంటూ బిగ్ బాస్ కి చెప్పటం కూడా జరుగుతుంది.. అందర్నీ అడిగినా కూడా ఎవరూ చెప్పకపోయేటప్పుడికి నిన్న జరిగిన షోలో నోరు జారారు.. అమ్మా – నాన్న ఇలాగే పెంచారా ? దొంగతనం చేయడం అనేది పెద్ద గేమా ? ఏదైనా సరే మగాడిలా ఆడాలి ! ఇలాంటి డైలాగ్స్ వేస్తునే ఉన్నాడు. నాకు తెలిస్తే వాళ్ల తొక్కతీస్తా. తోలు తీస్తా అంటూ ఫ్రస్టేట్ అయ్యాడు. 

ప్రిన్స్ రతిక టాస్క్ వార్.. (Rathika – Prince)

Radhika and Prince Yawar task war in bigg boss telugu 7
Radhika and Prince Yawar task war in bigg boss telugu 7

ప్రిన్స్ అవర్ మొదటి దగ్గర నుండి గేమ్ లో అగ్రెసివ్ గాని ఆడుతున్నాడు తన బాడీతో చాలెంజ్ గేమ్స్ కూడా సులువుగా విన్ అవుతూ ఎలిమినేషన్ నుండి తప్పుకుంటున్నాడు.  అయితే ఎవర్ని మొదటి వారం దగ్గర్నుంచి ఏదో కారణంతో ఎలిమినేషన్ లో ఉంచుతున్నారు హౌస్ మేట్స్.  ప్రస్తుతం నాలుగు వారాల ఇమ్యూనిటీ కోసం అలాగే బిగ్ బాస్ లో పవర్ అస్త్రాన్ని సాధించటానికి స్థానం దక్కించుకోగా.. ఇందులో ప్రిన్స్ ని వ్యతిరేకిస్తూ రతిక, థామిని, తేజలు ఓట్లు వేశారు.

అది తప్పు అని నిరూపించడానికి  బిగ్ బాస్ ఒక టాస్క్ ఇవ్వటం జరుగుతుంది. గార్డెన్ ఏరియాలో ఉన్న స్టాండ్ పైన గెడ్డాన్ని ఆనించి గంట సేపు ఉండాలి. ఈలోగా తనని ఛాలెంజ్ చేసిన ఇంటిసభ్యులు ప్రిన్స్ ని డిస్టర్బ్ చేయాలి.  ఇందులో భాగంగా ప్రిన్స్ ని రతిక బాగానే ఇబ్బంది పెట్టిందని చెప్పవచ్చు.. తేజ ఐస్ ని తీస్కుని వస్తే, ఆ ఐస్ ని ప్రిన్స్ ప్యాంట్ లో వెనక నుంచీ పోసింది రతిక. అంతేకాదు, థామని సబ్బు నురగని కలిపి ప్రిన్స్ ముఖంపై కొట్టింది.

- Advertisement -

ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రిన్స్ తన ఏకాగ్రతని ఎక్కడా పొగొట్టుకోలేదు. అయితే ఆడియన్స్ అందరూ రతిక చేసిన పనికి సీరియస్ అయ్యారు. ఎందుకంటే, ఐస్ వేరే ఎక్కడైనా కూడా పోసి డిస్టర్బ్ చేయచ్చు. కానీ కావాలనే ప్రిన్స్ ప్యాంట్ లో పోసింది రతిక. ఇక ఆ తర్వాత దానిపైన జోకులు కూడా వేసుకున్నారు. 

రెచ్చిపోయిన శోభాశెట్టి గౌతమ్… (Shobha Shetty Bigg Boss 7)

Shobha Shetty Gautam fight in Bigg Boss Telugu 7 house
Shobha Shetty Gautam fight in Bigg Boss Telugu 7 house

నిన్న జరిగిన ఎపిసోడ్ లో హౌస్ దద్దరిల్లిపోయిందని చెప్పాలి ఒకవైపు టాస్క్ అలాగే మరోవైపు శోభా శెట్టి అలాగే గౌతమ్ గొడవతో బాస్ హౌస్ అంతా హీట్ వాతావరణం కనపడుతుంది. అసలు గౌతమ్ కి ఎందుకు కోపం వచ్చిందంటే, బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం ముగ్గురులో ఒక కంటెండర్ ని ఈవారం రేస్ నుంచీ తొలగించాలి అన్నప్పుడు గౌతమ్ శోభాశెట్టి పేరు చెప్పాడు.  

తను ఐసోలేటెడ్ గా ఉంటోందని, గణేష్ ఫెస్టివల్ కూడా రావడానికి మేకప్ వేస్కుంటూ టైమ్ వేస్ట్ చేసిందని, అలాగే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఆ టాస్క్ వచ్చేసరికి ఆడలేకపోతోందనే రీజన్స్ చెప్పాడు. ఈ రీజన్స్ ని బిగ్ బాస్ చూపించేసరికి శోభాశెట్టి రెచ్చిపోయింది.

ఇవి చాలా బక్వాస్ రీజన్స్ అంటూ రెచ్చిపోయింది.  పల్లవి ప్రశాంత్ కూడా చెప్పిన రీజన్ అంతగా శోభాకి నచ్చలేదు. అయినా, గౌతమ్ దొరికేసరికి రెచ్చిపోయి గొడవ స్టార్ట్ చేసింది. దీంతో శోభాశెట్టి తదుపరి ఛాలెంజ్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఛాలెంజ్ లో గెలిస్తేనే తనకి కంటెండర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మొత్తానికి మూడోవారం బిగ్ బాస్ 7 హౌస్ లో పెద్ద గొడవలే సృష్టించాడు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY