Bigg Boss Season 5 హోస్ట్ అలాగే కంటెస్టెంట్స్ వీరేనా..!

0
43
Bigg Boss Telugu Season 5 Contestants Names and Host details

Bigg Boss Season 5: తెలుగు బుల్లితెర పై ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ‘బిగ్ బాస్’ (Bigg Boss 5) రియాలిటీ షో.. ఇప్పుడు ఐదో సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది. ‘స్టార్ మా’ వాళ్ళు ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టారని తెలుస్తోంది. మొదటి సీజన్‌ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. గత నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు ఐదో సీజన్‌ (Season 5) ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఇందులో భాగంగానే ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపిక కొనసాగుతోందని సమాచారం. వారం పదిరోజుల్లో కంటెస్టెంట్లను ఖరారు చేసి.. క్వారంటైన్‌లో ఉంచిన తర్వాత సీజన్ స్టార్ట్ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. అన్ని అనుకున్నట్లు జరిగితే జూలై రెండో వారంలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభం కానునట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu Season 5 Contestants Names:

  • షణ్ముఖ్‌ జశ్వంత్
  • టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు
  • యాంకర్ వర్షిణి
  • కమెడియన్‌ ప్రవీణ్‌
  • యాంకర్ శివ
  • శేఖర్ మాస్టర్
  • హైపర్ ఆది
  • సింగర్‌ మంగ్లీ

Nagarjuna is Bigg Boss Telugu Season 5 Host

మరి ఇందులో నిజం ఎంతవరకు ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్’ 4వ సీజన్ కి నాగార్జుననే (Nagarjuna Host) హోస్ట్ గా కంటిన్యూ చేశారు. నాల్గవ సీజన్ ను కూడా నాగ్ హయ్యెస్ట్ (Host) టీఆర్పీ రేటింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా కొనసాగించగలిగారు. టెలివిజన్ స్క్రీన్ పై ‘బిగ్ బాస్ 4’ సంచలనాలు సృష్టించిందనే చెప్పాలి. దీంతో ‘బిగ్ బాస్ 5’ కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.