Bigg Boss Telugu Season 7 Voting Process Change: సెప్టెంబర్ 3 ఆదివారం రోజు బిగ్ బాస్ తెలుగు 7 సీసన్ ని మొదలు పెట్టడం జరిగింది.. నాగార్జున హోస్ట్ గా వస్తున్న ఈ సీజన్ మరింత డిఫరెంట్ గా ఉండబోతుంది అంటూ మొదటి రోజే క్లారిటీ ఇవ్వటం జరిగింది. దానికి తగ్గట్టుగానే గ్రాండ్ లాంచ్ షోలో కూడా మార్పులు కనపడ్డాయి. బిగ్ బాస్ సంబంధించిన అన్ని సీజన్స్ ఒకే లాగా ఉండటంతో ఈ రియాల్టీ షో మీద అంచనాలు తగ్గుతున్నాయని ఈసారి మేకర్స్ భారీగానే మార్పులు చేసినట్టు తెలుస్తుంది.
Bigg Boss Telugu Season 7 Voting Process Change: బిగ్ బాస్ 7 హౌస్ మేట్స్ గురించి చూసుకుంటే ప్రతిసారి 16 వరకు ఉండేవారు కానీ ఈసారి 14 మంది హౌస్ మేట్స్ మాత్రమే లోపలికి పంపడం జరిగింది. పంపిన 14 మంది కూడా హౌస్ లో ఉండటానికి ఇంకా అర్హత సంపాదించలేదు అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. బిగ్బాస్ 7 సీజన్లో ఎటువంటి మార్పులు చేశారనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ఇక ఓటింగ్ విషయానికి వస్తే నాగార్జున ఒక కీలక ప్రకటన చేశారు. ఈ సీజన్‌లో ఓటర్లు ఒక్కో పోటీదారునికి ఒక ఓటు మాత్రమే వేయాలి. హాట్ స్టార్ మరియు మిస్డ్ కాల్స్ ద్వారా ప్రతి వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉంటుందని ఒక ముఖ్యమైన ప్రకటన చేయబడింది. సీజన్ 1 మరియు 2 కోసం “Google ఓటింగ్ సిస్టమ్” ఉంది. సీజన్ 3 ప్రారంభం కావడంతో నిబంధనలు మారిపోయాయి. హాట్‌స్టార్ యాప్ మరియు మిస్డ్ కాల్ ఓటింగ్ సిస్టమ్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
బిగ్ బాస్ 4, 5 మరియు 6లో హాట్ స్టార్ అప్ అలాగే మిస్డ్ కాల్‌లపై ఓటింగ్ కొనసాగింది. కానీ ఉల్టా పుల్ట్ యొక్క సీజన్ 7 లో, మొత్తం ప్రక్రియ మారిపోయింది. పాల్గొనేవారికి ఒక ఓటు మాత్రమే. హాట్ స్టార్ అయినా.. మిస్డ్ కాల్ అయినా.. ఓటేయాల్సిందేనని హోస్ట్ నాగార్జున తేల్చేశాడు. మరి ఇలాంటి మార్పులు ఈ సీజన్లో ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియాల్సి ఉంది. మొత్తం మీద చాలా మార్పులతో బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ప్రారంభించడం జరిగింది మేకర్స్.