Bigg Boss Telugu 7 – The 2.0, Bigg Boss Telugu wild Card entry Contestants list, Bigg Boss This week nominations list, This week voting result, Bigg Boss 7 latest news.
నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 7 లేటెస్ట్ సీజన్ 5 వారాలు ముగించుకొని ఆరో వారంలోకి అడుగు పెట్టింది. ఈసారి హౌస్ నుండి ఐదుగురు లేడీ హౌస్ మేట్స్ ఎలిమినేట్ అవ్వటం రికార్డ్ అని చెప్పాలి. ఐదు వారాల్లో బిగ్ బాస్ చాలా ట్విస్ట్ అలాగే టాస్క్లతో హౌస్ అంతా కలకల్లాడింది. అంతేకాకుండా ఆదివారం ఎపిసోడ్లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఐదుగురు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వటం జరిగింది.
ఇక ఐదు వారాల ఎలిమినేషన్ చూసుకుంటే మొదటివారం కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రాధిక అలాగే ఐదో వారం శుభ శ్రీ ఎలిమినేట్ కాగా గౌతం మాత్రం సీక్రెట్ రూమ్ లో ఉంచడం జరిగింది. టీవీ సీరియల్ నటుడు అర్జున్ అంబటి, సింగర్ భోలే, ఇన్‌స్టాగ్రామ్ స్టార్ నాయని పావని, నటి మరియు మోడల్ అశ్వని శ్రీ మరియు పూజా మూర్తి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించారు.
ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కనిపించిన పాపల్ని చూస్తే.. వీళ్లకంటే సుబ్బు పాపనే బెటర్ అనేట్టుగా ఉంది. ముఖాలని చూసి ఆటని అంచనా వేయలేం కదా.. రూపు పరంగా అన్ ఫిట్ అనిపించిన ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. ఆట పరంగా ఫిట్ అనిపిస్తారో చూడాలి మరి.
వీళ్ళందర్నీ చూసి.. శివాజీకి మైండ్ బ్లాక్ అయిపోయింది. నవ్వుకి బదులు ఏడుపు వస్తుందిరా వీళ్లని చూస్తుంటే అని గార్డెన్ ఏరియాలోకి వెళ్లి తెగ నవ్వుకున్నాడు. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ 2.0 ప్రారంభ ఎపిసోడ్‌కు మాస్ మహారాజా రవితేజతో పాటు హీరోయిన్లు నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ముఖ్య అతిథిగా వచ్చారు. హీరో సిద్ధార్థ్ కూడా గెస్ట్ గా వచ్చి హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ తో కాసేపు ఆడి అలరించాడు.