పవన్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ దివి

86
పవన్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ దివి
పవన్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసిన బిగ్‌బాస్‌ బ్యూటీ దివి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ‘వకీల్ సాబ్’ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక దీని తర్వాత వరుస సినిమాలకు పవన్ కళ్యాణ్ ఓకే చేశారు. మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్`‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ తెలుగులోకి రీమేక్ చేస్తోంది. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకుడు వహిస్తున్నాడు.

 

 

ఈ సినిమాలో పవన్‌తో పాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు.  అయితే…నుంచి మరో వార్త వైరల్‌ అవుతోంది.  ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బిగ్‌బాస్‌ బ్యూటీ దివి నటించబోతుందట. మంచి రోల్‌ కావడంతో దివి ఈ ఛాన్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ కూడా ఇచ్చిందట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుందట. కాగా.. బిగ్‌బాస్‌-4 ఫినాలే కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కూడా దివికి సినిమా ఆఫర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెహర్‌ రమేష్‌ డైరెక్షన్‌లో వస్తున్న తన సినిమాలో దివికి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఇవ్వనున్నట్లు మెగాస్టార్‌ ప్రకటించారు.