Bimbisara Final Box office Collection: నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ బింబిసార. విడుదలైన మొదటి రోజు నుంచి మంచి టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షాన్ని కురిపించింది. బింబిసార బాక్సాఫీస్ కలెక్షన్స్ ని అలాగే బడ్జెట్ వివరాలను చూస్తే కళ్యాణ్ రామ్ డబుల్ ప్రాఫిట్ సాధించారనే చెప్పాలి. బింబిసార ఓటీటీ రిలీజ్ కూడా సిద్ధమైంది.
బింబిసార మూవీ కళ్యాణ్ రామ్ కి అలాగే ప్రొడ్యూసర్స్ కి మంచి పేరు తీసుకువచ్చింది. కాథరిన్ ట్రెసా మరియు సంయుక్త మీనన్ ఏడు నెలలుగా చేసిన బింబిసార ఫైనల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని చూస్తే ఈ విధంగా ఉన్నాయి. బింబిసార ఓవర్ అల్ బిజినెస్ 15 కోట్ల వరకు జరగ్గా ఇప్పుడు సినిమా ఫైనల్ కలెక్షన్స్ సుమారు 35 కోట్లు షేర్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం బింబిసార ఫైనల్ కలెక్షన్స్ ప్రొడ్యూసర్స్ కి డబల్ ప్రాఫిట్ నే మిగిల్చాయి. బింబిసార బ్లాక్ బాస్టర్ హిట్ అవటంతో దీనికి సీక్వెల్ గా వచ్చే బింబిసార 2 సినిమాని కూడా మరింత భారీ బుద్గేట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
Bimbisara OTT Release Date

బింబిసార థియేట్రికల్ రన్ ముగియటంతో ఇప్పుడు సినిమా లవర్సు బింబిసార ఓటీటీలోకి (Bimbisara OTT) ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చూస్తున్నారు. అయితే బింబిసార ఓటీటీ విడుదల తేదీ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంది.
బింబిసార (Bimbisara OTT) సినిమా ని జీ5 ఓటిటి ప్లాట్ఫాం లో అక్టోబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. దసరా కానుకగా బింబిసార సినిమా ని స్ట్రీమింగ్ కానుందట. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. బింబిసార కలెక్షన్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.