బాలీవుడ్‌ని వెంటాడుతున్న విషాదాలు.. మరో సినీ నటి మృతి

0
115

ఈ ఏడాది బాలీవుడ్‌ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. వరుసగా నటీనటుల మరణాలు బీ టౌన్ వర్గాలను కలచివేస్తున్నాయి. యంగ్ హీరో సుశాంత్ మరణం నుంచి కోలుకోక ముందే ఇంకొందరు నటుల మరణ వార్తలు వినాల్సివస్తుండటం జీర్ణించుకోలేక పోతున్నారు ప్రేక్షకులు. తాజాగా మరో నటి దివ్య చౌక్సే కన్నుమూశారని తెలియడం బాలీవుడ్ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది.

rn

హై అప్పా దిల్ తోహ్ అవారా’ చిత్రంలో నటించిన దివ్య చౌక్సే సుదీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడారు. దివ్య చౌక్సే మృతిని ఆమె బంధువు సౌమ్యా అమిష్‌వర్మ సంతాపం తెలిపి ధ్రువీకరించారు. దివ్య మృతికి సినీనటుడు సాహిల్ ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సంతాపం తెలిపారు. ‘‘మీ అభిరుచి, కల, సినీపరిశ్రమపై మీ సానుకూలత, మీ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. మీ ఆత్మకు శాంతి చేకూరుగాక, మీ జ్ఞాపకాలు నా హృదయంలో సజీవంగా ఉంటాయి’’ అని సాహిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. దివ్య చౌక్సే పలు యాడ్ ఫిల్మ్స్, టెలివిజన్ షోలలో నటించారు.

rnrnrn 

Previous articleTejaswi Madivada Hot Gallery
Next articleఅనసూయ భరద్వాజ్ ఫోటోలు