హైదరాబాద్‌ చేరుకున్న బాలీవుడ్ క్వీన్‌..!

0
399
bollywood actress kangana ranaut reaches hyderabad for Movie Shooting

kangana ranaut: బాలీవుడు నటి కంగనా రౌనత్‌ ఈ మధ్య వార్తల్లో బాగా వస్తోంది. మ‌హా సీఎం థాక్రేతో పాటు సోనియా ల‌క్ష్యంగా కంగ‌నా విమ‌ర్శ‌లు కొన‌సాగించింది… కంగ‌నా భ‌ద్ర‌త కోర‌టంతో ఆమెకు కేంద్రం వై-కేట‌గిరి భ‌ద్ర‌త క‌ల్పించింది. తాజాగా హైదరాబాద్ చేరుకుంది కంగనా రౌనత్. సినిమా షూటింగ్‌ కోసం నగరానికి వచ్చిన కంగనా 10 రోజులపాటు ఇక్కడే ఉండనున్నారు. రామోజీ ఫిలింసిటీలో జరిగే సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొననున్నారు..

అయితే సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం అనంతరం సంచలన వ్యాఖ్యలు చేయడంతో కంగనాకు, మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌ రాకను అధికారులు గోప్యంగా ఉంచారు. అదే విధంగా కంగనాకు వై కేటగిరి సెక్యూరిటీ ఉండటంతోపాటు తెలంగాణ పోలీసులు ఆమెకు పూర్తిస్తాయిలో భద్రత కల్పించనున్నారు.

Previous articleShruti Haasan to collaborate with Rana Daggubati for Netflix series
Next articleసినిమా నాకు బాగా నచ్చింది: బన్నీ