‘ఫైటర్’కు జోడి దొరికేసిందిగా..!

0
630
Bollywood Beauty Ananya Panday locked for Vijay Puri Fighter Movie
Bollywood Beauty Ananya Panday locked for Vijay Puri Fighter Movie

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ‘ఫైటర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా మూవీలో చేయబోయే ఫైట్స్ కోసం రౌడీ థాయ్‌లాండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ఇవాళ ముంబైలో మొదలైంది. ఫైటర్‌ను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో తెరకెక్కించనున్నారు.

ఫైటర్ కథ.. పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదటినుండి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ను తీసుకుంటున్నారని టాక్ వినిపించింది. అయితే జాన్వీ ఇతర సినిమాల్లో బిజీగా ఉండడంతో యంగ్ బ్యూటీ, నటుడు చుంకీ పాండే కూతురు అనన్య పాండేను కథానాయకిగా నిర్ణయించారని తెలుస్తోంది.

మరి.. ఆమె ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తారా.? విజయ్ ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేస్తారా.? లేదా అన్నది వేచి చూడాలి. కాగా, అనన్య ‘స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2’తో బాలీవుడ్‌కు పరిచయమై.. ‘పతీ పత్నీ ఔర్ ఓ’ సినిమాతో హిట్ కొట్టింది. ప్రస్తుతం ‘ఖాలీ పీలి’ అనే చిత్రంలో నటిస్తోంది.

Previous articleబన్నీ – సుకుమార్ మూవీ టైటిల్ పై షాకింగ్ న్యూస్
Next articleపాటలకే పరిమితం కాలేదు: నభా నటేష్‌