bollywood drug case rhea chakraborty bail plea hearing postponed

Rhea Chakraborty: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, డ్రగ్స్ సరఫరా చేసేందుకు తనను వాడుకున్నాడని రియా చక్రవర్తి సంచలన ఆరోపణలు చేసింది. బెయిల్ పిటిషన్‌లో ఇలా ఆరోపణలు చేసింది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి, మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ప్రస్తుతం జైలులో ఉన్న రియా చక్రవర్తికి ఆమె సోదరుడు షోవిక్‌ చక్రవర్తిలకు సంబంధించిన బెయిల్‌ పిటిషన్‌ విచారణను బాంబే హై కోర్టు రేపటికి (గురువారం) వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

రియా బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌లో సుశాంత్‌ గురించి నమ్మశక్యం కాని విషయాలు వెల్లడించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తరుచూ డ్రగ్స్‌ తీసుకునేవాడని, డ్రగ్స్ తీసుకురావాలంటూ సిబ్బందిని కోరేవాడని పేర్కొంది. సుశాంత్ జీవించి ఉంటే అతడిపై తక్కువ అభియోగాలు నమోదయ్యేవని, ఏడాది మాత్రమే జైలుశిక్ష విధించేవారని తెలిపింది. డ్రగ్స్ కోసం తనను, తన సోదరుడితో పాటు ఇతరులను సుశాంత్ వాడుకున్నాడని రియా ఆరోపించింది.

‘సుశాంత్‌ డ్రగ్స్‌ కోసం తనతో క్లోజ్‌గా ఉండే వారిని అంటే నన్ను, నా సోదరుడిని వాడుకున్నాడు. ఇందుకు సంబంధించి అతడు ఎలాంటి ఎలాక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ని వదల్లేదు. దాంతో ఆధారాలు లేవు. ఇప్పుడు మేం ఫలితం అనుభవిస్తున్నాం’ అని రియా విచారం వ్యక్తం చేసింది. ఆమె జ్యుడిషియల్ కస్టడీ నిన్నటితో ముగియగా.. న్యాయస్థానం అక్టోబర్ 6 వరకు పొడిగించింది. ఆమె బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించింది. తాజా బెయిల్ పిటిషన్‌ విచారణను బాంబే హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది.