Adipurush లో మరో బాలీవుడ్ హీరో!

0
607
bollywood hero ajay devgan will play role in adipurush movie

Ajay Devgan: Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న భారీ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ‘రాముడి’గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ‘లంకేష్’గా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఆదిపురుష్’ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. టీ సిరీస్ భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

గతంలో రావణుడి పాత్ర కోసం అజయ్‌ దేవ్‌గణ్‌ని సంప్రదించగా ఆయన డేట్స్ అడ్జట్స్‌ చేయలేకపోయారని సమాచారం. దీంతో ఆ రోల్‌ కోసం సైల్ అలీఖాన్‌ని తీసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం కోసం శివుడి పాత్ర కోసం అజయ్‌ని ఓకే చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్న అజయ్ దేవగణ్.. ‘ఆదిపురుష్’ లో నటించడానికి ఒప్పుకున్నాడట. ఇదే కనుక నిజమైతే ఈ సినిమాపై హైప్ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది.

Previous articleమాస్ మహారాజా ‘క్రాక్’ మూవీ మేకింగ్ వీడియో…!
Next articleపూజా క్యారెక్టర్ రివీల్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్