మహేష్ మూవీలో బాలీవుడ్ స్టార్!

0
247
Political backdrop for Trivikram-Mahesh movie

Mahesh Babu, Trivikram Movie: మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చాలా కాలం తర్వాత మళ్లీ ఓ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే దర్శకుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేయలేకపోయిన కథనే.. మహేష్ బాబుతో చేయబోతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఈ సినిమాలో యంగ్ సీఎంగా నటించి ఆ పాత్రకు న్యాయం చేశారు. అయితే మహేష్ బాబు మళ్లీ రాజకీయాలనే నమ్ముకుంటున్నారని తెలుస్తోంది.

అయితే ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నాడట త్రివిక్రమ్. పాత్రకు తగ్గ పర్సనాలిటీని తీసుకురావడంలో త్రివిక్రమ్ కు కొత్తేమి కాదు. గతంలోనూ త్రివిక్రమ్ చాలా సినిమాల్లో కీలక పాత్రలే ప్రధాన పాత్రలు పోషించిన సందర్భాలు ఉన్నాయి.

Bollywood Hero Sanjay Dutt Key Role in Mahesh Trivikram Film

వరుస సక్సెస్ లతో జోరుమీదున్న త్రివిక్రమ్ అల వైకుంఠపురములో ఇండస్ట్రీ హిట్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారని వార్తలు వస్తుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

 

Previous articleMost Eligible Bachelor confirm release date
Next articleOfficial: Ram Charan and Shankar #RC15 Pooja Ceremony Tomorrow