Sukumar Bollywood Hero Movie: గత మూడు సంవత్సరాలుగా టాలీవుడ్ డైరెక్టర్స్ అందరూ బాలీవుడ్ బాట పడుతున్నారు టాలీవుడ్ లో ఏదైనా ఒక సినిమా భారీ విజయం సాధించింది అంటే నెక్స్ట్ బాలీవుడ్ నుండి ఆఫర్ల వర్షం కురుస్తుంది. దీనికి ఉదాహరణగా వంశీ పైడిపల్లి , సందీప్ రెడ్డి వంగ వీళ్ళతోపాటు గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్ హీరోలతో సినిమాలు తీస్తున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్ గా క్రియేటివ్ డైరెక్టర్ అయిన సుకుమార్ కి బాలీవుడ్ హీరోలు సినిమా చేయాలని ఆఫర్లు పంపిస్తున్నారని ఫిలిం సర్కిల్ న్యూస్ వైరల్ గా మారింది.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా లేటెస్ట్గా రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాల కంటే సౌత్ లో విపరీతంగా కలెక్షన్స్ ని రాబడుతుంది.. పుష్ప మొదటి భాగం 400 కోట్లు కలెక్ట్ చేయిగా దానిలో 50% సౌత్ నుండే రావడం.. అలాగే పుష్ప 2 సినిమా కూడా 600 కోట్ల పైనే హిందీలో కలెక్ట్ చేయటం బాలీవుడ్ హీరోలని బాగా ఆకర్షించింది.
అంతేకాకుండా పుష్ప 2 సినిమా బాలీవుడ్ ఖాన్ లు..కపూర్ హీరోల సినిమాల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని వారం రోజుల్లో బద్దలు కొట్టింది. ఫిలిం సర్కిల్ నుండి అందుతున్న సమాచారం మేరకు బాలీవుడ్ హీరోలైన ఖాన్ లు..కపూర్ లు దర్శకుడు సుకుమార్ కి ఆఫర్లు పంపించారంట… అంతేకాకుండా ప్రత్యేకంగా ఒక హీరో అయితే మీరు ఎప్పుడు అంటే అప్పుడు నేను డేట్స్ ఇస్తానంటూ తన మేనేజర్ చేత సుకుమార్ కి డైరెక్ట్ గా కాల్ చేపించి మాట్లాడినట్టు తెలుస్తుంది.
మరి సుకుమార్ నిజంగానే బాలీవుడ్ హీరోలతో సినిమా చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.. కానీ ప్రస్తుతానికి అయితే రామ్ చరణ్ తో RC17 ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ సినిమాని ఫిబ్రవరి లేదా మార్చి నుండి షూటింగ్ కి వెళ్లాలని అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు.