సాహో ని రౌండ్అప్ చేసిన బాలీవుడ్

shraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal
shraddha kapoorshraddha kapoor, Prabhas, Saaho, Akshay Kumar, Mission Mangal

సాహో…ఈ సంవత్సరం ఇండియా లెవెల్ లో అన్ని ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షిస్తున్న అతి పెద్ద యాక్షన్ అడ్వెంచరస్ మూవీ సాహో.బాలీవుడ్ లో తనకు క్రియేట్ అయిన మార్కెట్ ని నిలబెట్టుకునేందుకు ప్రభాస్ తీసుకున్న క్రూషియల్ స్టెప్ ఇది.కాకపోతే ఈ సినిమాకి బాలీవుడ్ లో మాత్రం భారీ పోటీ ఏర్పడింది.ఈ సినిమా రిలీజ్ ని దృష్టిలో ఉంచుకుని తెలుగులో సైరా లాంటి సినిమాతో పాటు అనేక సినిమాల రిలీజ్ లు వాయిదా వేశారు.నాగార్జున మన్మధుడు-2 తప్పించి సాహో వచ్చే టైం కి థియేటర్స్ లో వేరే నోటెడ్ సినిమాల పోస్టర్స్ కనిపించవు.

[INSERT_ELEMENTOR id=”3574″]

బాలీవుడ్ లో మాత్రం సాహో కి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు ఖిలాడీ అక్షయ్ కుమార్.అక్షయ్ కుమార్ కి ఆగస్టు 15 కి హిట్ అందుకోవడం అనే ఆనవాయితీ ఉంది.అందుకే అతను నటించిన మిషన్ మంగళ్ ని ఆగస్టు 15 కే రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఇస్రో సైంటిస్ట్ రాకేష్ ధావన్ గా కనిపించబోతున్నాడు.ఈ సినిమా టీజర్ చూస్తేనే ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది తెలుస్తుంది.అక్షయ్ తో పాటు విద్యా బాలన్,సోనాక్షి సిన్హా,తాప్సీ,నిత్యా మీనన్,షర్మాన్ జోషి లాంటి స్టెల్లార్ స్టార్ కాస్ట్ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.సాహో కి సవాల్ గా నిలిచిన మరొక సినిమా జాన్ అబ్రహం నటించిన బాట్లా హౌస్.2008 లో బాట్ల హౌస్ లో జరిగిన ఎన్ కౌంటర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.ఆ రియల్ ఇన్సిడెంట్స్ ని తీసుకుని 11 సంవత్సరాల తర్వాత తెరకెక్కిస్తున్న రియల్ స్టోరీ కాబట్టి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.ఆ సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది.ఈ సినిమాకి జాన్ అబ్రహాం ఒక ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ సినిమా నిర్మాణంలో భాగంగా ఉన్న T సిరీస్ సాహో ని హిందీ లో రిలీజ్ చేస్తుంది.అయినా బాట్ల హౌస్ ని కూడా అదే డేట్ కి రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.సాహో లో కంటెంట్ లో గ్రాండియర్ నెస్ కి లోటు లేదు అని టీజర్ తో తేలిపోయింది.అయినా కూడా సినిమాలో కథాబలం కూడా ఉంటేనే బాలీవుడ్ లో వందల కోట్ల వసూళ్లు అనే రిజల్ట్ వర్క్ అవుట్ అవుతుంది.లేదంటే మాత్రం అంతే.పైగా మిషన్ మంగళ్,బాట్ల హౌస్ రెండూ కూడా రియల్ ఇన్సిడెంట్స్ తో నెయిల్ బైటింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతున్న సినిమాలు.సో,వాటిని తట్టుకుని సాహో కలెక్షన్ల పరంగా కూడా సాహి అనిపించాలి అంటే కథా,కథనాలు కూడా అమేజింగ్ గా ఉండాలి.లేదంటే 100 కోట్ల కలెక్షన్ కే పరిమితం కావాల్సి ఉంటుంది.

[INSERT_ELEMENTOR id=”3574″]