Bollywood Star Sanjay Dutt recovers from cancer and gets emotional in social media

Sanjay Dutt Cancer: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది క్యాన్సర్‌ బారిన పడ్డారు. అందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఏడాది ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కూడా రేర్ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కెజిఫ్ 2 విల్లన్ సంజయ్ దత్ స్టేజ్ 3 ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న సంగతి తెలిసినదే. దత్ కుటుంబం ఆ విషయాన్ని ఇంతకుముందు మీడియా ముఖంగా ప్రకటించింది. అటుపై ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్సను ప్రారంభించారు.

పైగా అది అడ్వాన్స్డ్ స్టేజీలో ఉందని తెలిసిన తర్వాత చాలా మంది భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఈయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ క్యాన్సర్‌ను జయించాడు. ఇదే విషయం ఈయన తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఆయనకు ఇటీవల పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పిఇటి) స్కాన్ చేశారట. అతని శరీరంలో క్యాన్సర్ కణాలు లేవని ఫలితం వచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 21 మధ్యాహ్నం సంజయ్ దత్ తన సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసాడు. అందులో తన పిల్లలలో కలిసి ఉన్నాడు ఈయన. తను క్యాన్సర్ నుంచి కోలుకున్నట్టు తెలియచేసాడు సంజయ్ దత్.