నందమూరి బాలకృష్ణ 105 వ చిత్రంగా తెరకెక్కిన ‘రూలర్’ చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతుంది. బాలకృష్ణ కి 2019 పెద్దగా కలిసి రాలేదు, ఎంతో ఆశపడి చేసిన ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. ఇలాంటి టైం ఈ ఇయర్ లోనే హిట్ కొట్టాలి అన్న కసి తో జై సింహా లాంటి హిట్ ఇచ్చిన కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో రూలర్ అంటూ సరికొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు బాలయ్య. ‘సి.కె.ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘హ్యాపీ మూవీస్’ బ్యానర్స్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్. రవికుమార్ దర్శకుడు. సోనాల్ చౌహన్, వేదిక లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో భూమిక, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీసెంట్ గానే ఉంది, వరుసగా బయోపిక్ సిరీస్ లోని 2 పార్టులు కూడా ఫ్లాఫ్ అయినా కానీ ఈ సినిమా డీసెంట్ బిజినెస్ ని అందుకోవడం విశేషం. ‘రూలర్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావలి అంటే 25 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. గతేడాది బాలయ్య, కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జై సింహా’ చిత్రం 29 కోట్ల వరకూ షేర్ ను రాబట్టి హిట్ సినిమాగా నిలిచింది. టఫ్ కాంపిటిషన్ లో ఈ చిత్రం ఎంత వరకూ కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి.
నైజాం | 5.5 cr |
సీడెడ్ | 5 cr |
ఉత్తరాంధ్ర | 2.5 cr |
ఈస్ట్ | 1.6 cr |
వెస్ట్ | 1.4 cr |
కృష్ణా | 1.6 cr |
గుంటూరు | 2.7 cr |
నెల్లూరు | 1.1 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.3 cr |
ఓవర్సీస్ | 0.3 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 24 cr |