Balakrishna Ruler Movie Day 1 Box office collections
Balakrishna Ruler Movie Day 1 Box office collections

(Balakrishna Ruler Movie Box office Collections) నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం ‘రూలర్’. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. బి,సి సెంటర్ ఆడియన్స్ కు ఈ చిత్రం కనెక్ట్ అయ్యింది కానీ ‘ఎ’ సెంటర్ ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ కాలేదనే చెప్పాలి.అయితే ఈ సినిమా కూడా ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో రూలర్‌ వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తికనబరుస్తున్నారు.

కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రూలర్‌ సినిమాకు తొలి షో నుంచే దారుణమైన టాక్‌ వచ్చింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథా కథనాలు. ఏ మాత్రం ఆకట్టుకోని బాలయ్య లుక్స్.. అయితే టాక్‌తో సంబంధం లేకుండా రూలర్‌ తొలిరోజు మంచి వసూళ్లనే రాబట్టింది. బాలయ్యకు ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ కారణంగా తొలి రోజు థియేటర్లు కళకళలాడాయి. ‘రూలర్’ చిత్రానికి 24 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రానికి 5.40 కోట్ల షేర్ వచ్చింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 19 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘రూలర్’ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..

నైజాం 0.68 cr
సీడెడ్ 1.08 cr
ఉత్తరాంధ్ర 0.27 cr
ఈస్ట్ 0.26 cr
వెస్ట్ 0.25 cr
కృష్ణా 0.19 cr
గుంటూరు 1.30 cr
నెల్లూరు 0.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.82 cr
ఓవర్సీస్ 0.33 cr
వరల్డ్ వైడ్ టోటల్ 5.40 cr (share)