ప్రతీరోజూ పండగే టోటల్ బిజినెస్ – చాలా ఈజీ టార్గెట్

230
Box office collections sai dharam tej prathi roju pandaga pre release business report
Box office collections sai dharam tej prathi roju pandaga pre release business report

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ వరుస 6 ఫ్లాఫ్స్ కి బ్రేక్ వేస్తూ ఈ ఇయర్ చిత్రలహరి సినిమా తో కంబ్యాక్ చేశాడు, ఇప్పుడు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో ప్రతీ రోజూ పండగే అంటూ వచ్చేస్తున్నాడు. ‘జిఏ2 పిక్చర్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్స్ కలిసి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సత్యరాజ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ మరియు తమన్ సంగీతంలో వచ్చిన పాటలకు మంచి స్పందన లభించింది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ పరంగా కూడా పోటి ఉన్నా డీసెంట్ బిజినెస్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. కానీ పోటి ఎక్కువగా ఉండటం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది, దాంతో పాటు పోటి లో ఉన్న సినిమాలను ఎదిరించి బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంటుంది. ‘ప్రతీరోజూ పండగే’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావడమే కాకుండా బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంటుంది.

ఇక ‘ప్రతీరోజూ పండగే’ చిత్రం ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 5.5 cr
సీడెడ్ 2.80 cr
ఉత్తరాంధ్ర 2 cr
ఈస్ట్ 1.3 cr
వెస్ట్ 1.1 cr
కృష్ణా 1.2 cr
గుంటూరు 1.45 cr
నెల్లూరు 0.65 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1 cr
ఓవర్సీస్ 1 cr
వరల్డ్ వైడ్ టోటల్ 18 cr