వెంకిమామ 6 డేస్ టోటల్ కలెక్షన్స్- తగ్గని జోరు..!

346
Venkatesh Naga Chaitanya Venky Mama 6 Days Box office Collections Report
Venkatesh Naga Chaitanya Venky Mama 6 Days Box office Collections Report

విక్టరీ వెంకటేష్‌, యంగ్ హీరో నాగ చైతన్యలు హీరోలుగా తెరకెక్కిన మల్టీ స్టారర్‌ మూవీ వెంకీ మామ. కేయస్‌ రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రేమమ్’ సినిమాలో కాసేపు వెండితెరపై కనిపించి అభిమానులను కనువిందు చేసిన రియల్ లైఫ్ మామ అల్లుళ్లైన విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ప్రస్తుతం వెంకీ మామ సినిమాలో పూర్తి స్థాయిలో కలిసి నటించారు.

మొదటి మూడురోజుల్లోనే 45 కోట్ల రూపాయలు వసూలు చేసి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. అయితే ఈ సినిమా వీక్ డేస్ లో రోజు రోజుకీ తగ్గుతూ వచ్చింది. కలెక్షన్స్‌ కంప్లీట్ డ్రాప్ కాకపోయినా చాలా వరకూ డ్రాప్ అయ్యాయి. అలాగే ఈ వీకెండ్ మరో నాలుగు సినిమాలు ఉండడం వల్ల సెకండ్ వీకెండ్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండే అవకాశం కనిపించడం లేదు. ఇక వెంకీ మామ 6వ రోజు ఆంధ్ర – తెలంగాణాలో సుమారు కోటి రూపాయల షేర్ తన ఖాతాలో వేసుకుంది.

నైజాం 8.65 Cr
సీడెడ్ 3.74 cr
ఉత్తరాంధ్ర 3.1 cr
ఈస్ట్ 1.75 cr
వెస్ట్ 1.11 cr
కృష్ణా 1.35 cr
గుంటూరు 1.81 cr
నెల్లూరు  0.81 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.25 cr
ఓవర్సీస్ 2.58 cr
వరల్డ్ వైడ్ టోటల్ 27.32 cr (share)

 

ఈ చిత్రంలో వెంకీకి జోడీగా పాయల్ రాజ్‌పుత్‌ నటించగా, నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. సురేష్‌ బాబు, టీవీ విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.