Boyapati RAPO Movie Story: అఖండ విజయం తరువాత బోయపాటి శీను తన తదుపరి సినిమాని రామ్ పోతినేని తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా నీ పాన్ ఇండియా లెవల్లో బోయపాటి శీను చిత్రీకరణ చేస్తున్నారు. రామ్ సినిమా స్టోరీ ఇదేనంటూ ఫిలిం సర్కిల్ లో న్యూస్ హల్చల్ చేస్తోంది.
Boyapati RAPO Movie Story: మొదటి దగ్గర నుంచి బోయపాటి శీను కి పొలిటికల్ డ్రామా స్టోరీలు బాగానే కలిసొచ్చాయి. ఇప్పుడు మళ్లీ రామ్ తో అదే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో కలిగిన స్టోరీని ఇస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ కి పొలిటికల్ సినిమా చేయడం ఇదే మొదటిసారి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ కి సంబంధించిన న్యూస్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంది అందుకనే బోయపాటి శ్రీను కూడా ఈ స్టొరీ ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అది కాక రామ్ కూడా ఈ తరహా సినిమా ఇంతవరకూ తన కెరీర్లో చేయలేదు.
ఈ సినిమాలో పొలిటికల్ పంచ్‌లు ఓ రేంజ్‌లో ఉండబోతున్నాయని టాక్. అలాగే రామ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు అని ఫిలిం సర్కిల్లో టాక్ నడుస్తుంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన రామ్ పోతినేని సినిమాని త్వరగా పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం.



అయితే బోయపాటి శ్రీను పాత సినిమాల తరహాలోనే యాక్షన్ సన్నివేశాలకు పెద్ద పీట వేస్తుంటాడు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో దాదాపు 6 నుంచి 8 యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది అలాగే రామ్ సినిమాలో ఊర్వశి రౌటాలా ప్రత్యేకమైన సాంగ్ లో కనిపించబోతుంది.
ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కూడా చేసినట్లు సమాచారం అలాగే రామ్ పోతినేని మొదటి పాన్ ఇండియా సినిమా కనుక మేకర్స్ ఈ సినిమాకి 80 నుండి 100 కోట్ల బడ్జెట్టు కేటాయించినట్లు టాక్ వినపడుతుంది. దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఈ సినిమాతో రామ్ పోతినేని కి మంచి హిట్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది.