Telugu popular director Boyapati Srinu's mother Seetharavamma passed away
Telugu popular director Boyapati Srinu's mother Seetharavamma passed away

టాలీవుడ్‌ దర్శకుడు బోయపాటి శ్రీ ను మాస్‌ మహారాజ్‌ రవితేజ.. ‘భద్ర’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన బోయపాటి శ్రీను అనతికాలంలోనే మాస్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తులసి, సింహ, దమ్ము, లెజెండ్‌ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన.. గతేడాది వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కాగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌తో బోయపాటి బిజీగా ఉన్నాడు. ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

బోయపాటి తల్లి బోయపాటి సీతారావమ్మ ఈ రోజు మరణించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె స్వగ్రామం గుంటూరు జిల్లా పెదకాకానిలో ఆమె తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె వయసు 80 సంవత్సరాలు.. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు బొయపాటి కుటుంబానికి ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నారు.

 

Telugu popular director Boyapati Srinu's mother Seetharavamma passed away
Telugu popular director Boyapati Srinu’s mother Seetharavamma passed away