Homeసినిమా వార్తలుకోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ తో ఫైట్ కు రెడీ అయిన ఉస్తాద్..!

కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ తో ఫైట్ కు రెడీ అయిన ఉస్తాద్..!

BoyapatiRapo to clash with LEO and CUSTODY and Ganapath - Part 1, Ram pothineni and Boyapati Srenu next movie BoyapatiRapo release date, BoyapatiRapo shooting update, BoyapatiRapo shooting location

ఎనర్జిటిక్ హీరో, ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. BoyapatiRAPO అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్ళిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇది రామ్ మరియు బోయపాటి శ్రీనులకు ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం కావడంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఇటీవలే మంచి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నారు.

రామ్ – బోయపాటి శ్రీనుల చిత్రాన్ని దసరా కానుకగా 2023 అక్టోబర్ 20న విడుదల చేనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పండుగ సెలవులు ఉంటాయి కాబట్టి, మంచి కలెక్షన్స్ సాధించడానికి ఈ చిత్రానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే అదే సీజన్ లో ఈ సినిమాకు పోటీగా రెండు భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి.

Ravi Teja to clash with Ram Pothineni at the box office

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లియో చిత్రాన్ని విజయదశమి స్పెషల్ గా అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశారు. లోకేష్ కనగారాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. తమిళ్ లోనే కాదు.. అన్ని భాషల్లోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు RAPO20 చిత్రాన్ని అదే సీజన్ లో తీసుకురానున్నారు.

మరోవైపు బాలీవుడ్ లోనూ రామ్ కి పోటీ ఎదురుకానుంది. టైగర్ ష్రాఫ్ నటిస్తున్న ‘గణపత్’ పార్ట్-1 (Ganapath – Part 1) ను రాబోయే దసరా పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అమితాబ్ బచ్చన్, కృతి సనన్ లాంటి స్టార్ క్యాస్ట్ భాగమైన ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నారు. ఇది హిందీలో రామ్ సినిమాకు ఇబ్బంది పెట్టే అవకాశాలు వున్నాయి. ఇక మిగతా భాషల్లోనూ పలు క్రేజీ చిత్రాలు అదే ఫెస్టివల్ కి ప్లాన్ చేసుకుంటున్నారు. మరి వీటికి గట్టి పోటీ ఇచ్చి, మన తెలుగు చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుందేమో వేచి చూడాలి.

ఈ మధ్య కాలంలో మన తెలుగు చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇప్పుడు రామ్ కూడా నార్త్ మార్కెట్ ను టార్గెట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే డబ్బింగ్ చిత్రాలతో హిందీలో రాపోకి ఫాలోయింగ్ ఏర్పడింది. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ రాబట్టిన సినిమాలు రామ్ ఖాతాలో ఉన్నాయి. అలానే బోయపాటి శ్రీను సినిమాలకు కూడా ఉత్తరాదిలో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు మాస్ హీరో, ఊర మాస్ కలయికలో రూపొందుతున్న సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

BoyapatiRAPO సినిమాలో రామ్ కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతెలా స్పెషల్ సాంగ్ లో ఆడి పాడనుంది. మోస్ట్ వాంటెడ్ మ్యాజిక్ డైరక్టర్ ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం సమూరుస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

 

For the latest Telugu movie news, entertainment exclusives, gossip, movie reviews, and more, follow the Chitrambhalare website and YouTube channel, or head to our social media platforms like Twitter, Facebook, Instagram!

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY