Brahmanandam to play a crucial role in Krishna Vamsi Rangamarthanda movie
Brahmanandam to play a crucial role in Krishna Vamsi Rangamarthanda movie

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం. ఆయనలో ఓ అద్భుతమైన నటుడు ఉన్నారు.. కానీ చాలా మంది దర్శకులు ఆయన్ను కామెడీ పాత్రలకే పరిమితం చేశారు. మరోసారి ఆయన అద్భుతమైన రోల్ లో కనిపించబోతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ‘రాజమార్తాండ’ సినిమాలో బ్రహ్మానందం మంచి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను చెబుతూ బ్రహ్మానందం ఫోటోను పోస్టు చేశారు కృష్ణ వంశీ. ఆ ఫొటోలో గడ్డంపై చేతిని ఆన్చి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బ్రహ్మానందం. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సరికొత్త బ్రహ్మానందాన్ని ఈ తరం ప్రేక్షకులు చూసే అవకాశం ఉందని అందరూ ఊహించేసుకుంటున్నారు.

మరాఠీ సినిమాను ‘నట సామ్రాట్’ ను తెలుగులో ‘రాజమార్తాండ’ గా రీమేక్ చేయనున్నారు కృష్ణవంశీ. ఒరిజినల్ వెర్షన్‌ని ప్రముఖ నటుడు మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేయగా నానా పటేకర్ లీడ్ రోల్ లో నటించాడు . ఎన్నో అవార్డులు అందుకున్న మరాఠి చితమైన నటసామ్రాట్ ను కృష్ణవంశీ తెలుగులో ఏ విధంగా రీమేక్ చేస్తారా అని కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ రీమేక్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించనున్నారు.