రూట్ మార్చిన రౌడీ

Breaking News Vijay Devarakonda Next Movie With Puri Jagannath
Breaking News Vijay Devarakonda Next Movie With Puri Jagannath

సినిమా ఇండస్ట్రీ లో ఎప్పుడయినా,ఏమైనా జరగొచ్చు అనేది పూరి విషయంలో మరొకసారి నిజమైంది.ఇస్మార్ట్ శంకర్ కంటెంట్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కుమ్మేసింది.అలాగే ఆ సినిమా చేసినందుకు రామ్ కి ఫుల్ గా పేరొచ్చింది.దాంతో పూరి మహేష్ పై కామెంట్స్ చేసినా కూడా మహేష్ సినిమా చూసి,పూరి ని పిలిపించి మరీ సినిమా గురించి పొగిడాడు.

ఇక పూరి ముందు నుండి కూడా విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యాలి అనుకుంటున్నాడు.కానీ విజయ్ మాత్రం పూరి ని పక్కనబెడుతూ వస్తున్నాడు.కానీ డియర్ కామ్రేడ్ ప్లాప్ అవ్వడంతో విజయ్ దేవరకొండ యూత్ లో మళ్ళీ తన ఫాలోయింగ్ ని పెంచుకోవడానికి పూరి కి ఛాన్స్ ఇవ్వడానికి ఓకే అన్నాడు.మామూలు హీరోలనే తన ఎక్సట్రీమ్ కారక్టరైజేషన్స్ తో సూపర్ గా ప్రెసెంట్ చేసే పూరి చేతిలో పడితే విజయ్ యాటిట్యూడ్ 10 రెట్లు ఎలివేట్ అవుతుంది.

ఈ కాంబో కి ఎంత క్రేజ్ ఉంటుంది అనేది కొత్తగా చెప్పక్కర్లేదు.అందుకే ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడానికి రెడీ గా ఉన్నట్టు తెలుస్తుంది.మరో రెండు రోజుల్లో జరగాల్సిన మీటింగ్స్ జరిగి,కండిషన్స్ ఓకే అయితే పూరి-విజయ్ కాంబో పట్టాలెక్కినట్టే.మొత్తానికి యావరేజ్ సినిమా తీసి కూడా పూర్వ వైభవం తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్.