Bro 1st Day Collections: పవన్ కళ్యాణ్ అలాగే సాయి ధరంతేజ్ కలిసిన సినిమా బ్రో ఈరోజు భారీ అంచనాల నడుమ విడుదలవడం జరిగింది. బ్రో సినిమా విడుదల కాకముందు అనుకున్నంత స్థాయిలో ప్రమోషన్స్ అలాగే బజ్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ విడుదలైన మొదటి రోజే ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అదేవిధంగా మొదటి రోజు బుకింగ్స్ తో బ్రౌన్ సినిమా బాక్సాఫీస్ (Box office) వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.
Bro 1st Day Collections: బ్రో సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాకి ఆంధ్రాలో ఫ్యాన్స్ ఎక్కువ అలాగే మొదటి రోజు ఆంధ్రాలో బుకింగ్స్ కూడా డే 1 సాలిడ్ గా ఉండగా.. నైజం ఏరియాలో కూడా బుకింగ్స్ బాగానే జరిగాయి. భారీ వర్షాల కారణంగా కొన్ని ఏరియాల్లో బుకింగ్స్ అంతగా నమోదు కాలేదు. day 1 బాక్స్ ఆఫీస్ కలెక్షన్ విషయానికి వస్తే బ్రో సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ట్రేడ్ వర్గాలు వారు కూడా భారీగానే అంచనాలు వేస్తున్నారు.
సమాచారం మేరకు, బ్రో సినిమా Day 1 బాక్సాఫీస్ వద్ద సుమారు 22 కోట్లపైనే ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. విడుదలైన అన్ని సెంటర్లో దాదాపుగా 60 శాతం బుకింగ్స్ జరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇక అన్ని ప్రాంతాల్లో ఆన్లైన్ బుకింగ్స్ అలాగే నైట్ షోకి సంబంధించిన బుకింగ్ వివరాలు తెలిస్తే ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు లేకపోలేదు. 98 కోట్ల బిజినెస్ జరిగిన ఈ సినిమా చివరికి ఎలాంటి రికార్డ్స్ ని బాక్స్ ఆఫీస్ వద్ద సొంతం చేసుకుంటుందో చూడాలి. సముద్ర కని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కేతికా శర్మ అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్గా చేయడం జరిగింది.