BRO USA Collection: పవన్ కళ్యాణ్ అలాగే సాయి ధరమ్ తేజ్ మొదటిసారిగా కలిసి నటించిన సినిమా బ్రో. ఈ సినిమాని తమిళ డైరెక్టర్ సముద్రక్కని దర్శకత్వం వహించగా జులై 28న భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అవటం జరిగింది. మొదటి షో లో పాజిటివ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది బ్రో సినిమా. ఇటు ఇండియాలోనూ అలాగే యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులను సృష్టిస్తుంది.
BRO Movie USA Collection: బ్రో సినిమా USA ప్రీమియర్స్ ప్రీ సేల్స్ నుండి $305K అత్యధికంగా వసూలు చెయ్యగా విడుదలైన మొదటి రోజు $700k కలెక్షన్స్ ని రాబట్టగలిగింది. ఇక అందరూ ఊహించిన విధంగానే బ్రో సినిమా USA బాక్సాఫీస్ వద్ద 1 మిలియన్ డాలర్స్ మార్క్ నీ రెండో రోజే క్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బ్రో సినిమా ఫాస్టెస్ట్ మిలియన్ డాలర్ సినిమాగా రికార్డు సృష్టించింది.
దీనితోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 35 కోట్ల దాటగా.. ఇప్పుడు రెండో రోజు 19 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని బాక్సాఫీస్ వద్ద బ్రో సినిమా రాబట్టగలిగింది. ఒకవైపు వర్షాలు మరోవైపు నార్మల్ టికెట్ రేట్స్ తోని ఈ కలెక్షన్స్ని సాధ్యం కాగా ఒకవేళ టిక్కెట్ రేట్స్ ఉంటే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చి ఉండేది.

అలాగే పవన్ కళ్యాణ్ కెరియర్ లో బ్రో సినిమా హార్ట్రిక్ అని చెప్పవచ్చు. వకీల్ సాబ్, భీమల నాయక్ అలాగే ఇప్పుడు బ్రో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వరుస విజయాలతో రికార్డు సృష్టిస్తున్నారు. బ్రో సినిమాని పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీ వాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ణయించారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.