Bro Movie Trailer: మామ అల్లుళ్లు పవన్ కళ్యాణ్ అలాగే సాయిధరమ్ తేజ్ మొదటిసారిగా కలిసిన నటిస్తున్న సినిమా బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఈనెల 28 విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. విడుదల తేదీ దగ్గర పడటంతో బ్రో ట్రైలర్ ని ఈరోజు మేకర్స్ విడుదల చేయడం జరిగింది. ఇక బ్రో ట్రైలర్ ఒక రకంగా చెప్పాలంటే థియేటర్లలో వంద శాతం వినోదం గ్యారెంటీ అని చెప్పవచ్చు.
Pawan Kalyan Bro Movie Trailer: బ్రో సినిమాలో ఉన్న నటీనటులు అందర్నీ ఈ ట్రైలర్లో పరిచయం చేస్తూ దర్శకుడు సమద్రికని చూపించిన విధానం చాలా బాగుంది. తనకు జీవితంలో దేనికీ సమయం లేదంటూ ప్రతి దానికి కంగారు పడుతూ ఇంట్లోనూ, పని దగ్గర హడావుడిగా ఉండే సాయి ధరమ్ తేజ్ పాత్రని చూపిస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది. కేతికా శర్మ అతని ప్రేయసిగా కనిపిస్తుంది. ఒక దుర్ఘటన మరియు సమయానికి ప్రాతినిధ్యం వహించే పవన్ కళ్యాణ్ రాక తర్వాత, అతని జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది.
పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా, కూలీగా అలాగే విభిన్న అవతారంలో కనిపిస్తూ బ్రో ట్రైలర్ మొత్తం మామ అల్లుళ్లు రచ్చ చేశారని చెప్పవచ్చు. సాయిధరమ్ తేజ్‌కి గతంలోకి వెళ్లే అరుదైన అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పడం మరియు జీవితం, మరణం గురించి చెప్పిన మాటలు కట్టిపడేస్తున్నాయి. ఇందులో ఎమోషన్, కామెడీ, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి. సాయిధరమ్ తేజ్‌ని ఆందోళనకు గురి చేసేలా అతని కుటుంబం చుట్టూ సంఘర్షణ జరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

డ్యాన్స్ స్టెప్పులు, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో ఈ చిత్రం ప్రేక్షకులకు వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని గుర్తు చేస్తుంది. సముద్రఖని కథ విషయంలో రాజీ పడకుండా అభిమానులను మెప్పించేలా సినిమాను అద్భుతంగా రూపొందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్, సాయి ధరమ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్రాండ్ విజువల్స్ మరియు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి ప్రధాన బలంగా నిలిచాయి.
ఈ సినిమాలో టైటిల్ పాత్రధారి(బ్రో)గా పవన్ కళ్యాణ్ కనిపిస్తుండగా, మార్క్ అకా మార్కండేయులుగా సాయి ధరమ్ కనిపిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, సముద్రఖని అలాగే మిగిలిన పాత్రలో చాలామంది నటీనటులు కనిపించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమస్త వారు ఈ సినిమాని భారీ బడ్జెట్లో నిర్మించడం జరిగింది. మరి సినిమా విడుదల అయిన తర్వాత ప్రజల్ని ఆకర్షిస్తున్న లేదంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.