శ్రీవిష్ణు బ్రోచేవారెవరురా రివ్యూ

Sree Vishnu Brochevarevarura Telugu Movie Review & Rating
Sree Vishnu Brochevarevarura Telugu Movie Review & Rating

విడుదల తేదీ : జూన్ 28, 2019
రేటింగ్ : 3 /5
నటీనటులు : శ్రీ విష్ణు, నివేదా థామ‌స్‌, స‌త్య‌దేవ్‌, నివేతా పెతురాజ్‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌
దర్శకత్వం : వివేక్ ఆత్రేయ‌
నిర్మాత : విజ‌య్ కుమార్ మ‌న్యం
సంగీతం : వివేక్ సాగ‌ర్‌
సినిమాటోగ్రఫర్ : సాయి శ్రీరామ్‌
ఎడిటర్ : రవితేజ గిరిజాల‌

[INSERT_ELEMENTOR id=”3574″]

శ్రీవిష్ణు,నివేతా పేతురాజ్ జంటగా మెంటల్ మదిలో సినిమా తీసి కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్న వివేక్ ఆత్రేయ తన రెండో ప్రయత్నంగా అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనెర్ గా ఉండేలా బ్రోచేవారెవరురా ని తెరకెక్కించాడు.ఈ సినిమాలో తన ఫస్ట్ సినిమాలో లీడ్ పెయిర్ ని రిపీట్ చేసిన వివేక్ అడిషనల్ గా నివేత థామస్ తో పాటు సత్యదేవ్,రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి లను ఎంచుకున్నాడు.ఈ టీమ్ అంతా కలిసి ఒక మంచి ఎంటెర్టైనెర్ ని రెడీ చేసారు అని ట్రైలర్స్ కన్వే చేస్తున్నాయి.ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది.మరి సినిమాలో కూడా అదే రేంజ్ కామెడీ ఉందా?,ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిందా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం.

బ్రోచేవారెవరురా సినిమాలో కథ చాల చిన్న థ్రెడ్.అల్ల్లరి చిల్లరగా తిరిగే ఒక ముగ్గరు,అమ్మ చనిపోవడంతో వేరే అవకాశం లేక నాన్నదగ్గరకు చేరిన ఒక అమ్మాయి మిత్రా…మిత్రాకి చదువు అంటే ఇష్టం ఉండదు,కానీ చదవాలి అని తండ్రి ఫోర్స్ చేస్తుంటాడు.అందుకే ఆమె ఇంట్లో నుండి పారిపోయి తన అమ్మమ్మ,తాతయ్య ల దగ్గరికి వెళ్లి తనకి ఇష్టమయిన డాన్స్ నేర్చుకోవాలి అనుకుంటుంది.అందుకోసం తనకి ఫ్రెండ్స్ గా మారిన R3 బ్యాచ్ సాయం కోరుతుంది.అయితే ఆమె ఇంట్లో నుండి పారిపోయి కంఫర్టబుల్ గా ఉండడానికి,R3 బ్యాచ్ ఖర్చులు కూడా కలుపుకుని మొత్తం 8 లక్షలు సంపాదించడానికి ఆమెనే కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడి,మిత్రా తండ్రి నుండి అనుకున్న అమౌంట్ అందుకుంటారు.అన్ని ప్రొబ్లెమ్స్ తీరిపోయాయి అని హ్యాపీ గా ఉన్న వాళ్ళ లైఫ్ లోకి కొత్త ప్రొబ్లెమ్స్ వస్తాయి,వాటిని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనే విషయంతో మిగతా సినిమా నడిపించాడు వివేక్ ఆత్రేయ.

[INSERT_ELEMENTOR id=”3574″]

తన మొదటి సినిమా మెంటల్ మదిలో సినిమాని కూడా సగం వరకు ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దిన వివేక్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఫీల్ ఎలివేట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో పూర్తిగా డ్రై గా మార్చెయ్యడం వల్ల సరయిన ఫలితం దక్కలేదు.కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ తప్పు చెయ్యలేదు.ఫస్ట్ హాఫ్ లో R3 బ్యాచ్ ద్వారా కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ పండించిన డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో కూడా బిత్తిరి సత్తి లాంటి పాత్రని వాడుకుని కామెడీ జనరేట్ చేసాడు.కథలోని ఎలిమెంట్ సింపుల్ గా ఉన్నా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉండడం,కామెడీ కోటెడ్ గా ప్రెజెంట్ చెయ్యడంతో సినిమా ఎక్కడా తగ్గిన ఫీలింగ్ రాలేదు.కాకపోతే కొన్ని సన్నివేశాలు మరీ సిల్లీగా ఉన్నట్టు,కన్వీనియంట్ స్క్రీన్ ప్లే రాసుకున్నట్ట్టు కనిపిస్తుంది.కాకపోతే నాన్ స్టాప్ కామెడీ వల్ల ఆ లోపాలు పెద్దగా కనిపించవు,ఇబ్బందిగా అనిపించవు.

రాహుల్,రాకేష్,రాంబాబు..షార్ట్ కట్ లో R3 గా శ్రీవిష్ణు,రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.ఈ ముగ్గురిలో ఎవ్వరు మిస్ అయినా ఆ బ్యాచ్ లో ఇంత కెమిస్ట్రీ …దాని ద్వారా ఇంత కామెడీ పండేదా? అనే ప్రశ్న సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వస్తుంది.ముఖ్యంగా శ్రీ విష్ణు డైలాగ్ డెలివరీ సినిమాలో సూపర్ గా పేలింది.అతను కొన్ని బూతులు లాంటి డైలాగ్స్ చెప్పినా అవి నవ్వించాయే తప్ప ఇబ్బందిగా అనిపించలేదు.రాహుల్ రామకృష్ణ,ప్రియదర్శి ల డైలాగ్స్ కూడా థియేటర్స్ లో ఫుల్లుగా పేలాయి.ముఖ్యంగా ఈ మధ్య సరయిన కామెడీ క్యారెక్టర్ పడక ఇబ్బందిపడుతున్న ప్రియదర్శి కూడా ఒక రేంజ్ లో నవ్వించాడు.నివేత థామస్ కి మాత్రం ఆమె నటనలో పొటెన్షియల్ ఎలివేట్ చేసేంత గొప్ప పాత్ర దక్కలేదు అనిపిస్తుంది.ఇక నివేతా పేతురాజ్,సత్య దేవ్ ల పాత్రలు సోఫిస్టికేటెడ్ పాత్రలు దక్కాయి.శివాజీ రాజా,బిత్తిరి సత్తి,ఘాన్సీ కూడా కడుపుబ్బా నవ్వించారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఈ సినిమాలో కామెడీ పండడానికి టెక్నీషియన్స్ బాగా ఉపయోగపడ్డారు.సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి పెద్ద ప్లస్.చాలా సన్నివేశాల్లో సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ లోని గొప్పతనం కనిపిస్తుంది.అలాగే డిఫరెంట్ ఆర్.ఆర్ లు ఇవ్వడంలో మాస్టర్ అనిపించుకుంటున్న వివేక్ సాగర్ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పుకోవచ్చు.సినిమాలో ఎక్కడెక్కడ ఎలాంటి సౌండింగ్ ఉండాలి అనే విషయంలో డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ల టేస్ట్ ఒకే రకంగా ఉండండంతో సినిమా అవుట్ ఫుట్ ఎలివేట్ అయ్యింది.ఈ సినిమాలో కనిపించిన క్యారెక్టర్స్ లో నవ్వించకుండా ఉన్నవి చాలా తక్కువ.సినిమా క్లయిమాక్స్ కూడా పెద్దగా క్లాస్ పీకకుండా సింపుల్ ఎండింగ్ ఇచ్చారు.ఓవర్ ఆల్ గా చూస్తే బ్రోచేవారెవరురా అన్ని ఏజెస్ కి అప్పీల్ అయ్యే హిలేరియస్ ఎంటర్టైనర్.బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఈ సినిమా భారీ విజయం దక్కించుకోవడం ఖాయం.ట్రైలర్స్ తో ప్రేక్షకులకు ఏదైతే ప్రామిస్ చేసారో ఆ ప్రామిస్ 100 పర్సెంట్ నిలబెట్టుకుంది ఈ సినిమా టీమ్.

[INSERT_ELEMENTOR id=”3574″]