Aadhi Burrakatha Trailer One Man, Two Brains
Aadhi Burrakatha Trailer One Man, Two Brains

హిట్ కోసం ఆల్మోస్ట్ తల్లక్రిందులుగా తపస్సు చేస్తున్న ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా బుర్రకథ.ఒకే మనిషికి రెండు బ్రెయిన్స్ ఉంటే అనే నావెల్టీ థాట్ తో నడిచే సినిమా ఇది.ఒకే మనిషి రెండు కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ లో కనిపించడం అనే క్లిష్టమైన పాత్రని ట్రైలర్ వరకు బాగానే పోషించాడు ఆది.హీరో పాత్రవరకు అపరిచితుడు ఛాయలు ఉన్నా కథ ఎక్కువగా కామెడీ మీటర్ లో నడవడం వల్ల ఈ సినిమా పాస్ అయిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

సినిమా కాన్సెప్ట్ ప్రకారం సవ్యసాచి టచ్ కూడా అక్కడక్కడా కనిపిస్తుంది.రాజేంద్ర ప్రసాద్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యేలా కనిపిస్తున్నాడు.డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.ట్రైలర్ వరకు ఓకే అనిపించింది.ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన ప్రోమో సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.పైగా ఆది మాస్ మసాలా డోస్ తో ఉండడం వల్ల అది ఈ సినిమాని మాస్ లోకి తీసుకెళ్లడానికి ప్లస్ అవుతుంది.ఇక హీరోయిన్ మిష్టి కూడా వీలైనంతవరకు తన అందాలతో ఆకట్టుకోవడానికి ట్రై చేసింది.ఇన్ని రకాల పాజిటివ్ పాయింట్స్ ఉన్న ఈ బుర్రకథ కొత్తదనంతో హిట్ అందుకుంటుందా లేక రొటీన్ సినిమాల ఫ్లో లో కొట్టుకుపోతుందా అనేది ఈ నెల 28 న తేలుతుంది.

Click Here For Trailer

 

[INSERT_ELEMENTOR id=”3574″]